Jump to content

పుట:రామాయణ విశేషములు.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామాయణ విశేషములు 157 మాడు హిందువు కానరాలేదు.” మెగస్తనీసు ఇట్లనెను: “హిందువులలో అబద్ధమాడువారు, తస్కరులు, వ్యభిచారులు లేరు." ఇదికూడా కల్ల యందురా? అడైతే మరల వినుడు. క్రీ.శ. 1200 ప్రాంతపు షంషొద్దీన్ అబూఅబ్దుల్లా అను ఆరబిట్లు వ్రాసెను: “హిందువులు హింస చేయరు. మోసము చేయరు. వారికి మృత్యుభయము లేదు”. ఇదికూడా అబద్ధ మందురా? ఇక సర్వం కల్ల, సాగరంకల్ల అనువారితో మాకుప్రసక్తిలేదు. ప్రజల కేది హితమో దానిని రాజులు ముఖ్యముగా ఆచరించ వలెనని బాలుడగు రామునికి విశ్వామిత్రుడు బోధించెను. నృశంస మనృశంసంవా ప్రజారక్షణ కారణాత్ పావనంవా సదోషంవా కర్తవ్యం రక్షతా సతా. -బాల, 25-18. 'మంచిరాజు ప్రజల రక్షించు నిమిత్తమై క్రూరము కాని, అక్రూరముకాని, పాపముకాని, అపవాదము వచ్చునది కాని యేది ప్రజలకు హితమో దాని నవశ్యము చేయవలెను' అని బోధించెను. విశ్వామిత్రుడు రాజుగా నుండగా వసిష్ఠుని చూడబోయెను. వసిష్ఠు డతని నిట్లు మొట్ట మొదటి ప్రశ్నగా విచారించెను: “రాజా, నీకు క్షేమమా? ధర్మమార్గమున చరించి ప్రజల రంజించి ధార్మికుడవై రాజవృత్తముచే పరిపాలించుచున్నావు కదా?" (బాల 52-7) రాజవృత్తమును గురించి పూర్వికులిట్లు నిర్వచించినారు: న్యాయే నార్జన మర్థస్య వర్ధనం పాలనం తథా, సత్పాత్రే ప్రతిపత్తిశ్చ రాజవృత్తం చతుర్విధం. న్యాయముగా ధనము సంపాదించుట, దానిని వృద్ధిపొందించుట, రక్షించుట, సత్పాతమున కొసంగుట, ఇవి రాజవృత్త మనబడును.