156 రామాయణ విశేషములు కామీ వా నకదర్యో వా నృశంసః పురుషః క్వచిత్ ద్రష్టుం శక్య మయోధ్యాయాం నా విద్వాన్ నచనా స్తికః సర్వేనరాశ నార్యశ్చ ధర్మశీలాః సుసంయుతాః ఉదితాః శీలవృత్తాఖ్యాం మహర్షయ ఇవామలాః ఈ విషయములో వివరములకై బాలకాండ షష్ఠ సర్గమంతయు చదువవలెను. అయితే ఇదంతా కవి కపోలకల్పితమని యనవచ్చును. ఇంచు మించు అదేకాలములో నుండిన ఆశ్వపతి కైకేయ వృత్తాంతమును గూర్చి ఛాందోగ్యోపనిషత్తు (5_11-5) లో ఇట్లు వ్రాసియున్నారు: ప్రాచీన శాలాచులు ఉద్దాలక ఆరుణి పురస్సరులై వైశ్వానరమును గూర్చి తెలుసు కొనుటకై అశ్వపతి కైకేయ అను రాజునొద్దకు వెళ్ళిరి. రాజు వారికి కానుకలర్పించుకొనగా వారంగీకరించుటకు నిరాకరించిరి. తనలో ఏదో లోపమున్నదని వారట్లు సంకోచించిరేమో యని సంశయించి అశ్వపతి వారితో ఇట్లు మనవిచేసుకొనెను “న మే స్తేనో జనపదే న కదర్యో. న మద్యపో, నా నాహిలాగ్నిః, నా విద్వాన్, నస్త్వేరీ, న స్వైరిణీ కుతో" నా రాజ్యములో దొంగలు లేరు, పిసినిగొట్టులు లేరు, మద్య పాయులులేరు, అగ్నిహోత్రము చేయనివారులేరు, చదువురానివారులేరు, స్త్రీ పురుషులందు వ్యభిచారు లొక్కరునులేరు. ఇది కట్టుకథయందురేమో? అదైతే క్రీ పూ. 200 ఏండ్ల ప్రాంత మందు గ్రీకులు, రోమనులు ఏమన్నారో వినుడు. స్ట్రాబో యిట్లనెను: “హిందువులు సత్యనిరతులు. వారి యిండ్లకు తాళాలు వేయరు. వారి వ్యవహారాలకు పత్రాలవసరము లేదు." అర్రియన్ ఇట్లన్నారు: "అబద్ధ
పుట:రామాయణ విశేషములు.pdf/206
Appearance