రామాయణ విశేషములు 149 12వ గణితములో పాండిత్యముండును. ప్రపంచానికి సరియగునట్టి గణితశాస్త్ర భిక్ష పెట్టినది హిందువులే. సున్నను మొట్ట మొదట కనిపెట్టినది హిందు వులే. ఆ సున్నయే కనిపెట్టకుండిన ప్రపంచ విజ్ఞాన శాస్త్రము ఇంచు మించు సున్నగానే యుండి యుండును. తొమ్మిది అంకెల తర్వాత ఇతర జాతులవారు పదికొక అంకెను పదకొండు కొకటి యీ విధముగా ఒక్కొక్కరూపమును వ్రాయుచూ పోయిరి ఎంతవరకని అట్లు అంకెలను సృష్టించుచు పోగలరు? అందుచేత కొన్ని జాతులవారు 1000 వరకు వెళ్ళేవరకు అలసిపోయిరి. కొన్ని జాతులలో లక్షకు పేరు లేదు. నేటికిని పాశ్చాత్య జాతులలో పది లక్షలకు మిలియ౯ అందురు. అటుపై వారికి కోటి, అర్బుదము శంఖము, వంటి సంఖ్యనామములు లేనేలేవు. బాబిలోనియావారు 12 నక్షత్ర రాసులను కనిపెట్టిరి. ఆ 12 సంఖ్యయే నేటికిని యూరోపు జాతులకు ప్రధానము. వారు లెక్కలను 12 వ ఎక్కముతో ఎక్కువగ గుణింతురు. డజన్ల మాటనే చెప్పుచుందురు. వారికి దశకము తెలియదు. (Decimal system) దశాంశ పద్ధతిని మొదలు కనిపెట్టినది హిందువులు. నేటికిని తురేనియు (Turanian race జాతి డజన్లతోనే వ్యవహారాలు చేసుకొందురు. వాల్మీకి కాలములో ఏక సంఖ్య మొదలుకొని మహౌఘమువరకు సంఖ్యానామము లేర్పడియుండెను. (“కోట్యాపరార్థేశ్చ” అయో. 15-48). అది వారు పొందిన గణితశాస్త్ర పరమావధి. మనవారు 4500 ఏండ్ల క్రిందటనే మిలియన్ (10 లక్షల) పేరుకంటె ఊహించజాలనట్టి అంకెల పేరులను కనిపెట్టి ముందునకు సాగిపోయిరన్న వారి ప్రజ్ఞాబలముయొక్క ఉచ్చస్థాయి కానవచ్చు చున్నది ఎట్లనగా నూరు లక్షలు కోటి, అటుపై శంఖము, మహాశంఖము, బృందము, మహా బృందము, పద్మము, మహా పద్మము, ఖర్వము, మహా ఖర్వము, సమ ద్రము, ఓఘము, మహోఘము అను సంఖ్యలను పేర్కొనిరి. (యుద్ధ. 28-34 నుండి 39 వరకు) ఇట్టి గణిత విజ్ఞాన మానాడే ఏర్పడినందున తర్వాతి కాలములో ఆర్యభటుడు, వరాహమిహి
పుట:రామాయణ విశేషములు.pdf/199
Appearance