148 రామాయణ విశేషములు ఒక విధమగు పలాశమునుండి దీర్ఘాయువు నిచ్చు ఔషధమును సిద్ధము చేయు క్రియను వ్రాసియున్నారు. # - రామసైన్యములో నలుడెట్లు మంచి శిల్పియో సుషేణు డట్లు మంచివైద్యుడు. (యుద్ధ. 92-20) అయితే చిత్ర మేమనగా సుషేణుడు, జాంబవంతుడు, నలుడు, హనుమంతుడు - వీరందరును అనార్యులే. ఆనార్యులలో కూడ ఓషధీ ప్రభావ యెక్కువగా నుండుటకు ఆటవికులగు గోండు, చెంచు, ముండా మున్నగువారిలో ఓషధీ వైద్యము విశేషముగా నుండునని ప్రతీతి. శస్త్రవైద్యమును కూడా ఆ కాలములో అభ్యాసము చేసియుండిరి. 'గర్భస్థజంతో 8వ శల్యకృంతః' సుం. 28-6. (సర్జరీ) పిండము గర్భమందే మృతించిన దానిని తునకలుగా కత్తిరించి బయటకు తీయుచుండిరి. జాంబవంతుడు మంచి వైద్యవేత్త. హనుమంతునితో హిమవత్పర్వతమందు ఋషభ కైలాసగిరులమధ్య ఓషధీపర్వత మున్నదనియు, ఆందు నాలుగు ఓషధులు మృతసంజీవని, విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధానకరణి అనునవి కలవనియు చెప్పి వాటిని తెమ్మనెను. (యుద్ధ 74-38). హనుమంతుడు ఆకాశ గమనముతో హిమవంతమునకు పోవుట, ఓషధులు గల పర్వత భాగమునంతయు ఉత్పాటనముచేసి అరచేత పెట్టుకొని మరలు ఆకాశమార్గమున వచ్చుటయు, పని తీరిన తర్వాత దానిని యథాస్థానమందు వేసివచ్చుటయు, ఇదంతయు కవి కపోల కల్పితముగా కనబడుచున్నది దగ్గరి గుట్టలలో ఓషధులను వెదకి తెచ్చిన తెచ్చియుండును. ఇది వైద్యమును గురించిన చర్చ. ఇక గణితశాస్త్రమును గూర్చి విచారింతము. జ్యోతిషమునకు గణితమునకు దగ్గరి బాంధవ్యమున్నది. జ్యోతిషము తెలిసినవారికి
- ఓ.సీ. గంగూలీ వ్యాసము. మాడరన్ రివ్యూ, ఆగష్టు 1937 లో