150 రామాయణ విశేషములు రుడు, భాస్కరాచార్యుడు మున్నగు గణితాచార్య శేఖరులు హిందువు లలో ఉత్పత్తియైరి. వారు వ్రాసి పెట్టి పోయిన గణిత రహస్యములను పాశ్చాత్యు లిప్పుడు క్రొత్తగా పై మహోపాధ్యాయులు గతించిపోయిన 1500–2000 ఏండ్ల తర్వాత కనిపెట్టుచున్నారు! కాని గ్రీకు పండితులైన ప్రాచీన యూక్లిడ్, ఆర్కిమిడీసు పేర్లను ఎల్లప్పుడును విసుగులేకుండా పొగిడే మన యింగ్లీషు ప్రభుజాతికి బానిసజాతిలోని వరాహమిహిర భాస్కరాచార్యాదులు ఎన్నడును కానరారు! శుల్బసూత్రాలను యెత్తుకో నరు! అయితే సున్నను ప్రాచీనమందు కనిపెట్టలేదు. క్రీ. శ. 800 తర్వాతనే సున్న హిందువులచే మొదటిసారి కనిపెట్టబడెనని చరిత్రకారు లన్నారు. (చూ. National History of Indian people Vol_VI. P. 418) రామాయణములో చాతుర్వర్ణ్యముల వర్ణనము పలు తావులలో కలదు. "శూద్రాఃసర్వధర్మనిరతాః" (బా.6-18) అని ఆదిలోనే కలదు. ఈ గ్రంథమందు రామకాలమని నిర్ణయించిన క్రీ. పూ. 2500 ప్రాంత మందు బుద్ధభగవానుని కాలమందు ఘనీభవించిన జన్మప్రాముఖ్యముకల నాలుగు వర్ణములుండెనా? అందు శూద్రజాతి యుండెనా? శూద్ర చర్చకల భాగాలు ప్రక్షిప్తమనవలెనా? అనునవి చర్చనీయములు. వేదములలో ఋగ్వేదమే సంపూర్ణ ప్రామాణిక గ్రంథము. తర్వాతివాటిలో అర్వాచీ నత్వము, ఖిలత్వము, ప్రక్షిప్తము అను విషయాలు కలవని అనేకులు విమర్శించిరి. ఋగ్వేదమంతటను త్రైవర్ణికులే వర్ణితులు. వారికన్న తక్కువగా భావింపబడినవారు దస్యులు. వారార్యుల పొరుగుభూముల వారై శత్రువులై జితులై యుండినట్టివారు. అందుచేత దస్యశబ్దమునకు “దాస” (బానిస) అనియు, దొంగ అనియు అర్థమిచ్చిరి. అవి ద్వేష మువలన కల్పితమైన యర్థములు పరాజితులను బానిసలుగా నేలుట సర్వ ప్రపంచ మఁదాచారముగనుండెను అట్లున్నను దస్యులతో త్రైవర్ణికులు బాంధవ్యము చేసిరి. కవష ఐలూషుడు దస్యుడేకాని ఋషియయ్యెను.
పుట:రామాయణ విశేషములు.pdf/200
Appearance