పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 55

సీ. వానిమోమును జూచి నే నేల మరు లైతి
జిగిగందమామపై వెగటు దోఁప
వానిమైసొగ సెంచి నే నేల వలచితిఁ
గలువలపాన్సుపైఁ గసటు వొడమ
వానినవ్వు దలంచి నే నేల చిక్కితిఁ
జిక్కనిపాలపైఁ జేఁదు గొనఁగ
వానిమా టాలించి నే నేల లో నై తిఁ
జిలుకపల్కులపైని జుల్క నమర
తే. వానివాతెర నే నేల యాసఁ గంటి
జీనిచక్కెరయుక్కెర[1]లేని మాన
[2]నిందు కేమందు నేమందు నందితిందు
[3]నెపుడు హరిపొందు గనుఁగొందు నెట్టులుందు. 63

సీ. కనుఁగవ హరిమోము గనుఁగొననే కోరు
వీనులు హరిమాట వినఁగఁ గోరు
నాసిక హరిమేని వాసన ల్గొనఁ గోరు
నధరంబు హరిమోవి యానఁ గోరుఁ
జెక్కిలి హరిగోటి నొక్కు టెక్కుల కోరు
గుబ్బలు హరిఱొమ్ముఁ గ్రుమ్మఁ గోరుఁ
గరములు హరి నెంతొ కౌఁగిలింపఁగఁ గోరు
మేను శ్రీహరిప్రక్క మెలఁగఁ గోరు
తే. నిన్ని యొక్కొకటే కోరు నిదిగొ నాదు
మనసు గోరెడికోరికెల్ మట్టు లేవు
మర్మమెందుకు మదనసామ్రాజ్య మిచ్చి
నెగడు హరియె యాయుర్దాయ మగుట శుకమ. 64

తే. మనసు కరఁగును హరిముద్దు మాట విన్న
మోహ మెద నిండు హరినగుమోము గన్నఁ

  1. లేనిమాలి [మూ.]
  2. తిందు కేమందు మదిని నానంద మొందు [మూ.]
  3. దెపుడు [మూ]