పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24 రాధికాసాంత్వనము



తే. మేల్మి పచ్చలగద్దియమీఁద నుంచి
చేరి యనసూయ మొదలగు పేరఁటాండ్రు
మన యిళామాధవులకు శోభన మటంచుఁ
జల్లఁగాఁ బాడి సుంకులు చల్లి రపుడు. 81

సీ. చెక్కుటద్దములపైఁ జెమటబిందువు లూరఁ
గస్తూరితిలకంబు గరఁగి జాఱఁ
గరకంకణంబులు ఘల్లుఘల్లని మ్రోయ
నలువంకఁ జూపు వెన్నెలలు గాయ
స్తసభార మోర్వక తనుమధ్య మసియాడ
నించుమోహంబుతో నీవి నీడ
గబ్బిసిబ్బెపుటుబ్బుగుబ్బచన్గవ పొంగ
బాహుమూలోజ్వలప్రభ లెసంగఁ
తే. గటితలంబునఁ గీల్జడ నటన మాడ
[1]గగనమున కేగునిట్టూర్పు గాడ్పుతోడఁ
దాళగతు లొప్ప సంపెంగతైల మంటెఁ
దమక మెదనాటి హరికి రాధావధూటి. 82

తే. చెలులచే యానుకొని లేచి కలికి యిడిన
పాదుకలు మెట్టి రాజసప్రౌఢి నేగి
మేటిమగరాలముక్కాలిపీటమీద
శౌరి కూర్చుండె మజ్జనసదనమునను. 83

క. లికుచకుచ శౌరి కత్తరి
లికుచరసం బిడియె నఖరరేఖలచే నొ
క్కొకటిగఁ జి క్కెడలింపుచుఁ
బ్రకటితఘననీలకేశపాశంబందున్. 84

క. కుంకుమ నలు గిడె నొకచెలి
పంకజదళనేత్రు మేనభావములోనన్.

  1. ఘనతరం బైన [మూ.]