ఈ పుట అచ్చుదిద్దబడ్డది
యని తనుగురించి బుధజను లభినుతింప
ఠీవిఁ దళుకొత్తు శ్రీకృష్ణదేవుఁ డనఁగ 49
సీ. సవరంపుపరువంపు సవరంపురుచి నింపు
నెరసొంపు గలజంపుకురులతోడ
నలువొందునెలలందుఁ గళలెందుఁ [1]దగఁజిందు
తొగవిందుజిగిఁ జెందు మొగముతోడ
నునుదమ్ములను దిమ్ములను నిమ్ములనయమ్ము
గనునొమ్ము సిరిగ్రమ్ముఁకనులతోడ
[2]నొగిఁ బ్రబ్బుబిగిరబ్బు నగుమబ్బు బిగి నుబ్బు
లను ద్రొబ్బుగననబ్బు తనువుతోడఁ
తే. గీ. [3]దనర వ్రేపల్లెలోఁ గలతలిరుఁబోండ్లు
హరికపటచర్యలకు మోహితాత్మ లైరి
యెప్పుడును జేరి మెప్పించు చొప్పుఁ జూచి
మరులుపూనరె సతు లైన మౌను లైన 50
సీ. గురుకుచకుంభము ల్కుధరము ల్గా కున్న
గోపాలకరఘాతిఁ గొనఁగ నేల
కలికివాల్గన్నులు కలువలు గాకున్న
హరి[4]చూపుకాంతిచే నలర నేల
తుల మించుమైదీఁగె యలమించు గాకున్నఁ
గృష్ణాంబుధరముతో నెనయ నేల
శ్రీపాదపద్మము ల్చిగురులు గాకున్న
మాధవుచేఁ జెల్వ మంద నేల