పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142 రాధికాసాంత్వనము

ఉ. అంతఁ బడంతి మై మఱచె నంబుజనాభుఁడు మోవి యానె సీ
మంతీసి చక్కు నొక్కె హరి మర్మము లంటె మిటారి ముద్దిడెన్
కాంతుఁడు గోట మీటెఁ జెలి కన్గొనె వెన్నుఁడు నీవి విప్పె నా
కంతునిదంతి తారసిలెఁ గమ్మవజీరునిపోరుకున్ వడిన్. 101

వ. ఇ ట్లనంగసంగరోత్సాహతరంగితాంతరంగు లై రాధామాధవు లొక్కరొక్కరి చక్కనినెమ్మేనికమ్మనెత్తావుల సొమ్మసిల్లుచు ముమ్మరం బగుమోహంబుల నెమ్మదిం జెంది రందు నందు సోదరీరత్నం బవాంతరలజ్జాభరంబునుంగొన మందరధరుం డమందానందంబున నందం బగుచెందొగలవిందుచందంబును డిందుపఱచు సుందరమందస్మితవదనారవిందంబునం గ్రందుకొని ముద్దువెట్టినం బెట్ట నీయక నిద్దంపుటద్దంబున కుద్ది యై తద్దయు నొప్పు ముద్దుచెక్కుల నొక్కిన నొక్కనీయక కప్పుగాఁ గప్పుకప్పులం గుప్పుగొప్పనెరికొప్పు నిమిరిన నిమరనీయక చొక్కంపుకెంపుసొంపుసంపాదించు తావిచెంగావిమోవి యానిన నాననీయక కట్టాణిముత్తియంబులతీఁగెమోడికుట్టుపనులఁ గనుపట్టు కెంబట్టురైకకుం బట్టుచాలక మట్టుమీఱి గుట్టు బయటఁబెట్టుగబ్బిసిబ్బెపుటుబ్బుగుబ్బచనుగుబ్బలం బట్టినం బట్టనీయక రంగుబంగరుదింటెనవిరివెంటనంటుతుంటవింటిదంటయింటి నంటిన నంటనీక మించుమించన మించుక్రొమ్మించు మెయిదీఁగె కౌఁగిటఁ గదియించినం గదియించనీయక దాపురంబులు వెట్టుచు నలయించిన నలయించువిలుగొన్నమన్నెదొరం గన్న న్నయాయన్నులతలమిన్న నొంటికళ లంటి సొక్కించి వితాళించి చివచివ లొడవఁ జివుకు చివుక్కునం బైకెక్కి నిక్కి చక్కెరమోవి నక్కజంబుగఁ జుక్క లేరుపడఁ జుఱుక్కున నొక్కి మక్కువ నెక్కొనం జెక్కిలి గొట్టి మదదంతిపై మంతుకెక్కుమావంతుటెక్కున సొక్కు దక్కి గిలుకలచప్పరకోళ్ళమంచపుహళహళలును వెలిపక్కిరెక్కదూది త్తలో నత్తమిల్లుకీచుబుఱ్ఱలకూతలును సురతశ్రమంబుల నెదల గమగమవలచుగోరజవాదిప్రోదినెత్తావులు ఘుమ్ముఘు మ్మనం గ్రమ్మ బిసబిసవిసరెడిహొసపరిసురటిపిట్టల రెట్టచప్పుడులును బకదారులమ్రోఁతలును సారసకోకిలములకివకివలును గుక్క తిప్పక కొక్కోకశాస్త్రమ్ముం బ్రసంగించుకలికిచిలుకలకలకలంబు