పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 143

లం గప్పినపరవశమ్ములం దప్పి చమురుసామువరుస లెత్తి యిచ్చుగోరవంకల యెలుఁగులును నిచ్చలపుముచ్చటలం బెచ్చుపెరుఁగ మెచ్చు లిచ్చురాయంచలవళావళులును గళరవమ్ములును మంజుమంజీరఝళంఝళధ్వనులును విడకు విడువకు తడఁబడకు మెడమిడక విడివడి తొడఁబడ నదుమదుము మనునుడువులును ఘనజఘనసంఘట్టనాచటచటాత్కారంబులు తోరంబు లై మీసరంబు లగుపైసరంబు లెత్త నాబిత్తరి తత్తరిలక హత్తుకొని తళుకుతళుక్కు మనుచిలుకతేజీవజీరుహజారంబునం దమి చిలుక నెదురొత్తు లిచ్చుచు సాటిలేనిమేటిగోటిపోటులం జొత్తిల్లు కొతనెత్తురుల మతిల్లుబిత్తరపుగుత్తంపుచనుగుత్తు లెద నొత్తి యిరుఁగేలు సాచి కంబుధరుగళంబును గౌఁగిలించి మోము మోమునన్ జేర్చి తన్మధురాధరసుధారసధారలం గ్రోలి తియ్యనిరుచులం దేలె నిట్లిరువురు నొడలడరఁ దొడరిదుడుకు లదరింపులు భ్రూభంగంబులను చిఱుసన్న లుద్దవిడిపద్దు లగ్గలికెతాకునూకులు వీఁకమీఱ బాహాబాహిం గచాకచిం బెనంగుచుఁ జెంగట నెసంగు భర్మనిర్మితచిత్రరత్నరత్నమాలికాయంత్రపాంచాలికాహస్తవిన్యస్తమల్లరంగసముల్లసితమల్లవల్లభుల దండి వెనుదండివిడక న్యస్తసువర్ణవర్ణనీయసుగంధబంధురసుమతాళవృంతోద్ధూతహతప్రవర్ధితాగురుధూపధూమస్తోమంబు లెగిరి నిగనిగ మనుజిగిమొగులనఁ గప్పుకొని యన్యోన్యానలాలోకనోత్సాహమోహంబుల నించుక యపనయింపఁ బునఃపరస్పరదర్శనోద్యోగవేగంబులంబుట్టి బెట్టునిట్టూర్పుగాడ్పులం గొట్టువడి యెట్టకేలకుం దెట్టగిలి నెట్టన మొగంబులు చూచుకొని తడవెడసి యొడఁ బడినజక్కవపక్కులమక్కువ లంది యిం పొందం. బొందు చౌశీతిబంధప్రతిబింబంబుల ముకురంబులం గని సంకుచితమందహాసంబుల నిరపొందుచుఁ బెనంగు సమయంబున. 102

క. హత్తుకొని యిన్నివిధములఁ
దత్తరపడ ననఁగి పెనఁగి తనివారక యా
బిత్తరి పైకొనె హరిపై
మత్తేభముమీఁద నెక్కు మావంతుఁ డనన్. 108