పుట:రాధికాసాంత్వనము (ముద్దుపళని).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



ప్రస్తావన


సీ. శ్రీపరిపూర్ణమౌ వ్రేపల్లెవాడలో
నందగోపాలునిమందిరమున
నవతీర్ణుఁడై మేనయత్తయౌ రాధికా
విధుముఖిచేఁ బ్రేమఁ బెంపుఁగనుచుఁ
దనమేనమామకూఁతు నిళాలతాంగిని
బెండ్లాడి యామెతో వేడ్క నుండఁ
దనవియోగముచేతఁ దాళఁజాలక చాలఁ
జింతిల్లుచుండుటఁ జిల్కవలన
తే. విని మిథిలనుండి యింటికి వేగ వచ్చి
చతురగతులను రాధికాసాంత్వనమ్ముఁ
జేసి దక్షిణనేత నా వాసిఁ గన్న
చిన్నికృష్ణుని మనసులో నెన్నుచుందు.

నేను జిన్ననాఁటనుండియు సంగీతవిద్యతోపాటుగా సాహిత్యవిద్యయందుఁగూడఁ గొంచెము గొప్పపరిశ్రమచేయుచు మాదేశభాషయగు కన్నడములోను తెలుఁగులోను బెక్కుగ్రంథములు చదివితిని. తరువాత బెంగుళూరినుండి యీ చెన్నపట్టణమునకు వచ్చినది మొదలుగా నఱవములోఁ గూడ ననేకగ్రంథములఁ జదువుచుంటిని. అయినను నాకాంధ్రభాషాగ్రంథములయందుఁ గలయభిరుచి పైభాషలలో నంతగా లేకపోయినది