ఈ పుట అచ్చుదిద్దబడ్డది
౧౪
పునీతమైనదో నిశ్చయించ వీలూ ఆధారములూ లేవుకాని…ఇంతవరకూ రంగాజీ—ముద్దుపళనీ, పృథక్తయా ఆ—ప్రతిష్ఠను—పంచుకుంటున్నారు…
ఇంకొక రాధ ఉన్నది…వృషభాను నందిని. ఆమె కన్య: స్వీయ; కృష్ణుని ధర్మపత్ని. రూపగోస్వామి——‘విదగ్ధమాధవము’లోనూ, మధురాదాసు—‘వృషభానుజ’లోనూ ఈ రాధవివాహగాథను రూపకవస్తువుగా తీసుకున్నారు. పరిణయ పరిణితికి—యోగిని నాయికానాయకులకు రాయభారములు నడిపింది. అంతేకాని, వృషభానుజ—రాధ...పరకీయ్య కాదు…
ఏది ఎలా ఉన్నప్పటికీ మన్మథమన్మథునికి—సరిపోలిన నాయిక రాధ, ఆమె పరకీయ అయినందువల్లనే దాంపత్యశృంగారము అప్రాకృతధోరణిలో పల్లవించి…వివిధ—రత్యాలంబనభావశబలితమైనది.
రాధ ప్రేమవాహినిని…తెలుగు కావ్యకేదారప్రాంతముల పరవళ్లు సోలించిన ముద్దుపళని… ఉత్తమ—ధన్య…
(వెంపటి నాగభూషణము)