పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజశేఖరవిలాసము

13


మ్మానవనాథురాజ్యమును మానుఁగఁ దేటవహించు నెంతయున్.


వ.

అట్లగుటం జేసి నేర్పరి యగుమంత్రిగల రాజు రిపులం జయించి యక్షీణరాజ్య
సుఖంబు లనుభవించుం గావున సప్తాంగబలంబులకన్నఁ బెద్దయగు మత్రాంగబలం
బు పరిగ్రహించితివే యని మఱియు భవదాగమనప్రయోజనంబును సవిస్తరంబు
గాఁ దెల్పుమనిన నద్ధరావల్లభుం డిట్లనియె.


క.

జననుత! మీరాజ్ఞ యొసం | గినరీతి నొనర్చినాఁడఁ గృతపుణ్యభవ
ద్ఘనకరుణను నే నిచటకిఁ | జనుదెంచుట మీపదాంబుజంబులఁ గొల్వన్.


సీ.

గురునాథ! జంగంబు గోరినవస్తువు నెద్దియైన ముదంబు నివ్వటిల్ల
నొసంగి జగంబులం దసమానకీర్తులఁ జెంది గిరీశుఁ డానందమొంద
నట్టు గావించెదనని తగనూహించి వ్రతము గైకొనఁగోరి వచ్చినాఁడ
మీర లిందుల కిచ్చమెచ్చి యాదరమున నీక్షింప నిప్పుడే దీక్ష యొసఁగి
భూతి నొక్కింత నొసటిపై బొట్టు బెట్టి | పాదతీర్థంబు మూర్థంబుపైని జల్లి
యాజ్ఞ దయసేయు మనుటయు నతనిఁ జూచి | యద్భుతంబొంది యాచార్యుఁ డనియె నపుడు


ఉ.

ఓనరనాథ! భూరిసుగుణోన్నత! నీ విపు డాత్మలోపలం
బూనినకార్య మాపవనభుగ్వరకంకణుఁడైన నిష్ఠతోఁ
దా నొనరింపఁజాలఁ డట ధారుణిలో జను లెట్టు నేర్తు ర
ట్లైన ప్రయోజనంబునకు నర్హమె నీ కిటు లూహ సేయుటల్.


ఉ.

ఇప్పటి భక్తిమార్గము నరేశ్వర! చిత్తమునందు నెప్పుడుం
దప్పక నిల్పఁజాలుదువె? తద్విధ మెంతయు దుర్లభంబు నీ
కెప్పగిదిం బొసంగు? వసుధేశ్వరు లెక్కడ? చెప్పఁ చోద్యమై
యొప్పువ్రతంబు లెక్కడ? మనోభవరూప! యెఱుంగఁబల్కుమా.


క.

ఇచ్చెద రనుచోటికిం గడు | వచ్చెద రార్యులు చెలంగి వారికిఁ గృపతో
నిచ్చల్ గలుగుపదార్ధము | లొచ్చెం బించుకయు లేక యొసఁగన్ వలయున్.


ఉ.

ఆరయఁ బుత్రినైన పతినైన దనూభవునైనఁ గాంచనా
గారములైనఁ జెల్వమగు కాయ మొకించుకఁ గోసియైన యా
ధారుణినైన నిట్టిశపథం బొనంరించినచోట వేటుగాఁ
గోరిక యెంత లేదనక గొబ్బున నీవలయున్ బుధాళికిన్.


చ.

ఘను లరుదెంచి యీఁదరము గానిపదార్థము లానతోడఁ గో
రినయెడ నీయఁజాలక ధరిత్రిపము న్నగుబాటుఁ జెందు కం