పుట:రాజశేఖరవిలాసము (కూచిమంచి తిమ్మన).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

ప్రథమాశ్వాసము


సీ.

బహుజన్మజనితమౌ పాపాబ్ధికినీ న వచర్చింప సద్గురుచరణసేవ
కమనీయపుణ్యలోకప్రాప్తికిని ద్రోవ చర్చింప సద్గురుచరణసేవ
చిరతరైశ్వర్యలక్ష్మీప్రదంబగు క్రేవ చర్చింప సద్గురుచరణసేవ
దుష్కర్మరుక్సంహతులకు నౌషధసేవ చర్చింప సద్గురుచరణసేవ
వనజసంభవముఖ్యగీర్వాణబృంద | ములకుఁ గానంగరాని శంభునిపదాబ్జ
దర్శనం బాత్మఁగోరిన ధన్యమతుల | కిరవలరుఠేవ సద్గురుచరణసేవ.


క.

అని తలంచి యాక్షణంబున | దినకరకులజలధిశీతదీధితి యగున
జ్జనపాలవరుఁడు కౌతుక | మునఁ దనరారుచును వేగమునఁ బయనంబై.


సీ.

గములు గూడుక కురంగములచందమున వేగమునఁ బారెడు తురంగములతోడ
నరుల కచ్చెరువుగాఁ దరలియాడెడు పెద్దగిరులఁ బోలెడుగంధకరులతోడ
సుతులు పేయఁగఁజాలు గతులఁ జెల్వలరారు నతులశతాంగసంహతులతోడఁ
గుటిలారివరులఁ గోమటులఁ జే సెడి మహార్భటులుగల్గిన వీరభటులతోడ
హితులతో మాన్యులగు పురోహితులతోడ | బుధులతోడను వందిమాగధులతోడ
మఱియుఁ దక్కినపరివార మరుదుమీఱఁ | గొలువఁజనియె నిలాభర్త గురునికడకు.


క.

అటు లరిగి కనియె నరపతి | పటుశైవకథారహస్యభాసురహృదయున్
ఘటితాఖిలజనకామున్ | నిటలాక్షపదాబ్జభక్తినిధి నాచార్యున్.


క.

కనుఁగొని వినయంబునఁ బద | వనజంబుల కెఱగి లేచి వసుధాధిపుఁ డొ
య్యన ముకుళితకరతలుఁడై | వినుతింపఁగఁ జూచి గురుఁడు వెస నిట్లనియెన్.


మ.

క్షితినాథోత్తమ! నీకు నీసతులకున్ సేమంబె? నీమంబుతో
సతతంబుం బ్రజ నేలుచుండుదువె? నీసైన్యంబులెల్లం బలో
న్నతి నొప్పారుటఁ జేసి శత్రువరులన్ మర్దించి యిష్టార్థముల్
కుతుకంబొప్పఁగ ధారుణీసురులకుం గొంచింప కీఁజూతువే?


క.

పరమర్మభేదనుండును | జిరమతిమంతుండు హితుఁడు శిష్టవ్రతుఁడున్
వరకులజుండునుఁ గరుణా | నిరతుండును నైనమంత్రి నీయెడఁ గలఁడే?


క.

దేవాధీశ్వరునకు మును | జీవుఁడు దామంత్రి యగుటచే ఘనుఁడయ్యెం
గావున విభవముఁ గోరిన | భూవిభునకు మంత్రివరుఁడు భూషణ మరయన్.


ఉ.

స్నానము సేయునీమమును శంభుపదార్చనఁ జేయుమర్త్యుఁడున్
వానలఁ గల్గుసస్యమును వారిరుహాహితుఁ డుండురాత్రియున్
మానిని గల్గుసౌఖ్యమును మంత్రివరేణ్యుఁడు గల్గ నొప్పు న