పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

83

గుహలో నల్లనియేనుగులు పిరంగిలోనున్న పొగవలె నున్నవని తాత్పర్యము.) ఈపద్యము విచారణీయము.

క.

ఉదిరి మలతోఁడ నొరయఁగ
నెదిరిన దొర పెక్కు వేల యేండ్లిల నధమున్
మెదలంగ నీని బల్లిదుఁ
డదయగ్రహములకు గ్రహమహా యితఁ డనుచున్.

79

76. ఉదిరిమల = మేరువు పర్వతము. అదయగ్రహములకు గ్రహము = గ్రహముల నడ్డగించినది.

క.

కాంచి గిరి కటక శిఖర
ప్రాంచనవైచిత్రి కాత్మ నలరి సరస్వ
త్కాంచీధవపంచానన
మించుక చనఁ దద్ధ రాభృదీశాను దిశన్.

80

80. సరస్వ......పంచాననము = సరస్వత్ = సముద్రము. కాంచీ = మొలనూలుగల భూమికి, ధవ = అధిపతులగు రాజులలో పంచాననము = సింహము, అనఁగా రాజశ్రేష్ఠుడు.

సీ.

భువనాభినవనాట్యభవనాపజవనాల
                 నలనాఢ్యపవనాశ్రయవిటపికము
కలికాపటలికాయుగలికార్క్ష్ణగలికాప్త
                 కులికాగ్రఫలికాంచకుంజగృహము
స్ఫుటజాతికుటజాతికుటజాతతటజాత
                 కటజాగ్రదుటజాపగతదురితము
గమలాసితమలాలితమలాళసమలాస్య
                 విమలాబ్జకమలాకరమహితంబు