పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

రాజవాహనవిజయము


యుత్తరాంభోధి తటసముదాత్తవిజయ
బంధురస్తంభజృంభితపయన కలన.

76

76. సాగ్రహారులు = ఆగ్రహముతోఁగూడిన శత్రులు. అగ్రజనులు = బ్రాహ్మణులు, తరువాటులు = వృక్షపంఙ్క్త్తులు. తెరవాటు గొట్టించి. త్రోవలు దోచుకొని. నేవాలయములు = పూజాశూన్యములు. పూజా...యములు = (పూజావాల = పూజకుఁ బాదులైన అనఁగా స్థానములైన, యములు = యతులు గలవి.) తనవాసులన్ = తనగౌరవములచేత. ననవ = క్రొత్తవి గాని, అసులన్ = కత్తులను. ననుపు = జీవనోపాధి. పయన = పొందుట.

క.

వనములు బహుజీవనపా
వనవనజాకరమునివరవసుధాధరఖే
దనభంజనజనరంజన
జనపదములు నదులు గడచి చనఁ జన నంతన్.

77

77. బహు.. ధర = విస్తారమైన యుదకముచేఁ బవిత్రమగు కొలకులును, మునిశ్రేష్ఠులును, పర్వతములును గల.

ఉ.

ముందరఁ గాంచె నిందుకులమోదసుధారసమందరంబు పౌ
రందరనీలకందళధురంధరసింధురబృందమందిర
త్కందరనిర్గతావిశదకాంత్యుపమేయనమత్పిరంగికా
తుందరణత్కృశానుధృతధూమవిశాలము వింధ్యశైలమున్.

78

78. ఇందు...మందరంబు = (రాజునకు విశేషణము.) ఉపమేయ = ఉపమేయవస్తువుగాఁ గల, (పిరంగికా. ఇది సంస్కృతశబ్దమని తోచదు.} తుంద = గర్భమందు. రణత్, ధ్వనించుచున్న (పర్వత