పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

రాజవాహనవిజయము

రాజుభార్యయొక్క. పస = శోభను, అని = పొంది, ఒక్కసాని = ఒక్కస్త్రీ. (ఇచ్చకాలమారియగు చెలికత్తెను వెంటఁబెట్టుకొని రాజభార్యవలె నొకసానిది రాగా దానినిఁ జూచి మరియొకతె యేమనుచున్నదంటే, నీవు దొరసానివంటిదానవు, నడచిపోవుట యుక్తము గాదు. రాజుగారి గుఱ్ఱమని సందేహించక వేగముగా వెళ్ళి ఓకొమ్మా .....కొమ్ము = అనగా దానిని బుచ్చుకో అన్నదని తాత్పర్యము.

శా.

మబ్బుంజాయల గీలుగంట్లు చెవియోరం జాలుకొన్ ప్రోగు లా
గుబ్బ నిబ్బరపుంగనీదు వికెం గ్రొమ్మించు పుట్టించు చన్
గుబ్బల్ పాదపుఁజుట్లు కన్నుల ముసుంగుల్ నుబ్బ బిబ్బోకమాన్
బిబ్బీ గబ్బి మిటారు లెక్కుతురగీబృందంబు చిందెన్ నడల్.

60

60. కీలుగంట్లు = జడలు. చాలుకొన్ = వరుసగానున్న, ఆగుబ్బన్ = అతిశయించగా, పాదపుజుట్లు = కాళ్ళ మెట్టెలు, నుబ్బన్ = ప్రకాశింపగా. బిబ్బోకము = విలాసమును. ఆన్ = పొందిన. బిబ్బీ ...టారులు = మ్లేచ్ఛస్త్రీలు, నడల్ = నడకలను. చిందెన్ = చిమ్మెను.

ఉ.

నెన్నడఁ జూపె వెండి రహి నిండిన సందిటి బొందు భూతితో
నెన్నొస లానఁ బాల్పెరుగు నెయ్యిని వాఁడెడు కోడెకాండ్రపై
వెన్నెలసోగ లీను జెలి వెన్కొను గన్గనఁ గన్న పాయపుం