పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

71

పండులోని తిరుమణులు, మొన...రవలు (మొన లరుగునట్టు దంతధావనముఁ జేసిన ముందరిపండ్లపైని సొగసుకై వేసిన జంగారపు పువ్వులు.) దయ...తులును (దయచేత ననఁగా సంరక్షణనిమిత్తమును, తాయెత్తులన్ = నీతి ఆచారము మొదలయినవానిచేత ననఁగా దేశాచారాదులచేతఁ తలిదండ్రులుంచిన రక్షలు.

ఉ.

ఇంటికి బొమ్ము క్రమ్మరఁ జెలీ! నిలు నిన్నిలు సేర్చి వత్తునో
వెంటనె దండు వచ్చెదవొ వేగమె రా మరియేల యందువో
యొంటి నిటున్న నళ్కొదవునో యని యాత్రకు నిక్కి రొక్కరం
దొంటరి జూచుచుండెఁ జనుచుండెడు మంది సఖీముఖేందునిన్.

58

58. అళ్కు = భయము, ఒంటరి = ఒక్కడుగా, మంది = జనులు

ఉ.

పైనఁపుదట్టిఁ గట్టుకొని బద్దుల పుట్టిక వెంటరాఁగ రా
సాని పసాని నవ్వు నెలజవ్వని రాఁగని యొక్కసాని యో
సాని మిటారి నీకు దొరసానికి నీనడ చెల్లదంచు భూ
జాని పటానిగా యనక జక్కి వెసం దిగి కొమ్మ కొమ్మనెన్.

59

59. పైనఁపుదట్టి = ప్రయాణానుకూలమయిన లాగు. బద్దులట్టిక = అబద్ధాలమారి. అనఁగా ఇచ్చకాలు జెప్పు చెలికత్తె, రాసాని =