పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

రాజవాహనవిజయము

55. వన్నెగుడ్డ = రంగుగుడ్డ, కఱదట్టి =నల్లనైన కాసెకోక, కటారిజల్లి = కత్తియొక్కు జాలరు. పట్టె = పటకా, మడికాసుల = వెండితోఁ జేసిన, నెట్టెపుగట్టన్ = పాగాకట్టునందు, నెట్టుకొను = తగులుకొనునట్టి, బోయబల్లిదుల్ = బలవంతులగు బోయవాండ్రు.

క.

బాణాసనములు కోలలు
పాణింగొని హస్తలోహపటుతరకటక
శ్రేణి ఘణిల్లన నృప సుమ
బాణుఁడు గన గోణి గదల బం ట్లరిగి రొగిన్.

56

56. గోణి = చిన్నవస్తువులు వేసికొనుటకు వీపున వేసికొన్న సంచి.

సీ.

నును దట్టిఁ జక్కఁ జెక్కిన వంకి పసపు పా
                 వడఁ బొల్చు చేకత్తి నిడుద గడలు
పెరిఁ జుట్టు సిగ నొంటిపొరగుడ్డ పని వడిఁ
                 దీర్చు కోవెలకుంట తిరుమణులును
మొన వాడిఁ ద్రిప్పి తోమిన మునిపండ్లపై
                 దళుకు తళ్కనెడు కుందనపురవలు
ఱొమ్ము గాయమ్ముల నెమ్మిఁ గాయలు గాచి
                 జిగి నించి మించెడి పగడములును


గీ.

దయనయాదుల గురులిడ్డ తాయెతులును
బులులఁ బొడిచిన నాటి సాములును దొంటి
యొంటిజగడంబు బెళకు లింపొసఁగ నడచె
డాక నరపాలువెంట నొంటరులమూక.

57

57. దట్టిఁజిక్కన్ = కాసెలో నిముడునట్టుగా, చెక్కిన = కూర్చినట్టి, వంకి = బాకు, కోవెలకుంట తిరుమణులు = దేవాలయపు