పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

65

చేయునట్టి గొలుసులు. నాగవడిగలు = చెవులనుంచుకొన్న నాగుజోళ్లు. ఒక్కాస్తి = ఒక్క పొడవుగల.

ఉ.

పట్టుమెఱుంగుజూ లుభయపార్శ్వఘణంఘణనాదఘంటికల్
మట్టుమెఱుంగులై మొరయ మస్తకమందును దృష్టి దండ గ
న్పట్టిన కర్ణచామర మపారపుమేలును మేలు మేలనం
బట్టపుదంతి నిల్పె నరపాలునిచెంగట మావటీ డొగిన్.

45

45. జూలు = ఏనుగుపై పరచు రంగుదుప్పటి; మేలు = ముదము.

ఉ.

సాన మెఱుంగురంగులఁ బొసంగు పిరంగి పరంగికేడె మా
హా నెఱయించు సింగిణులు నంపదొనల్ హురుమంజిపల్ల మిం
పైన ఖలీనముం బిరుదుటందియ గజ్జెలపేరు బూని దా
సానిపటానిఁ దెచ్చె మహిజానికి రాతెరగంటి ఱేనికిన్.

46

46. పరంగికేడెము = హూణదేశపుడాలు. ఆహా నెరయించు = ఆశ్చక్యముఁ గలిగించునట్టి. సింగిణులు = ధనస్సులు. అంపదొనల్ = అంబులపొదులు. పల్లము = జీను. ఖలీనము = కళ్ళెము దాసానిపటాని = దాసానిదేశపుగుఱ్ఱము, రాతెరగంటి ఱేనికిన్ = రాజేంద్రునికి.

క.

పౌరులు జయవెట్టగఁ బరి
చారకు లరచట్ట దౌరు సవరింపఁగఁ దు