పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

రాజవాహనవిజయము


గీ.

యొరపు టెఱయె కరంబు రం గొరగు నెదుట
బసివలపు లిచ్చు పచ్చాకు పసిడిపట్టు
బటువు జోడును బటువు పైపుటము గులుకఁ
బూని రందల మెంతయు బోయలంత.

43

43. అపరంజి = బంగారు వికారమైన, మొసలివా = మొసలినోళ్ళుగల, అనుసుల = తోళ్ళుగల, కొమ్ము = పల్లకీ దండీ. పొన్నాణెంపు = పొన్ను = బంగారముచేత, అణెంపు = ప్రశస్తమైన, ఉదిరి = మేలిమి బంగారము, గొడెల్ = బిదికీలు. ముసనాబు = అందలము ప్రక్కతెఱ. పైఠాణీ = పఠానిదేశపు దుప్పటి. ఎఱ = ఎఱుపు, ఒరఁగు = బాలీసు. బటువుజోడు = టెక్కెములజత, పుటము గులుకన్ = అతిశయించగా.

సీ.

గొనబుగా నురులఁ జెక్కిన చెంగుతోడ జే
                 నెడు బాఁకుతో బొల్చు నీవిదట్లు
ముందర ముడిఁగొని ముంగొంగు వెలివెట్టి
                 మాటు చెంగావి రుమాలు వులును
వ్రేలి వలంబున వ్రేలెడు మెడనూళ్లు
                 జాళువా ముంజేతి జతుల త్రాళ్లు
మొనపాటి ముత్తెముం చిననాగవడిగెలు
                 బిగువొప్పఁ దొడిగిన బిళ్ళచెప్పు


గీ.

లొసరు దుప్పట్లు కడ నిల్పి గునుకు నడల
నుచితనిజభాషణంబుల నొంటి యొంటి
హస్తమునఁ బూని యొక్కాస్తి బెస్త బిడ్డ
లందలము నిల్పి రవని పాలాగ్రసీమ.

44. ఉరులన్ = వ్రేలాడునట్టుగా. చెక్కిన = దిద్దినట్టి. నీవిదట్లు = ముడివేసిన కాసెకోకలు. జతులత్రాళ్ళు = చప్పుడు