పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

55

పాదము యొక్క బొటకన వేలు కలది. నిస్రవల్లాలాజాలము = కారుచు నుండెడి చొంగయొక్క సమూహమును గలది. కేళీధూళిపటలీలబ్ధాంగమున్ = ఆటయందు దుమ్ముసమూహమును బొందిన కరము గలది. హస్త...తంబు, హస్తచేష్టా = చేతులాడించుటను, లగ్న = అంటిన, ఈక్షణ = కన్నులందలి, కజ్జల = కాటుకతో, అన్విత = కూడిన, ముఖాబ్జాతంబు =పద్మమువంటి ముఖముగలది. దృక్పర్వంబు = కన్నులపండుగు.

సీ.

సాలముల్ రిపు ముట్టి సాధింతు నను లీల
                 నా లంకెగడి డింపఁ గాలిఁ దిగుచుఁ
బలుమరు నెరయ నిప్పగిది శత్రుశిరంబు
                 చెండుదు నను మాడ్కిఁ జెండు గొనునుఁ
దన దాడి కరి డాఁగు ననురీతిఁ జెలికాండ్ర
                 కదన డాగనముచ్చు లాడ నేర్చు
విమతుఁ డెందేగిన నెమకెద నన్న యు
                 న్నతి నాడు సిరిసింగనాల వృత్తి


గీ.

నసపుఁ గప్పురపుంగుప్ప లవని నుంతు
గూర్మి నను పేర్మి వెన్నెలకుప్ప లాడు
భ్రమరజితమధుకరపాళిరాట్కుమార
మౌళి కేళీవధూటీముదాళి యగుచు.

23

23. సాలముల్ = కోటలు. ముట్టి = తాకి, లంకెపడిన కడియమును. డింపన్ = దింపుటకు, కాలిన్ = పాదముతో. దిగుచున్ = లాగును. నెరయన్ = ప్రసిద్ధముగా, చెండు = బంతిని, దాడికిస్ = దండయాత్రకు, అరి = శత్రువు. అదన = సమయమందే. విమతుఁడు = శత్రుఁడు. నెమకెద = వెదకెదను. సిరిసింగనాలవృత్తి = బాల్యక్రీడావిశేషము. అసఁపు గప్పురపుంగుప్పలు = కీర్తికర్పూరపురాసులు. వెన్నెలకుప్పలు = బాలక్రీడావిశేషము. భ్రమర = ముంగురులచే. జిత =