పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

రాజవాహనవిజయము


చ.

జిలిబిలిపాలు జాలుకొను చెక్కులటెక్కును మద్దికాయలున్
గలుకలు రావిరేక చిఱుగజ్జియ లందియ లైదుకైదువల్
గల యపరంజిబిళ్ళ తుదిగం బులిగోరునుఁ బుట్టువెండ్రుకల్
చెలఁగెడి పట్టి పండువులు చేసెఁ దగన్ దలిదండ్రి కంటికిన్.

21

21. జిలిబిలి = అందముగా. జాలుకొను = ప్రసరించునట్టి. మద్దికాయలు = ఆభరణవిశేషములు, కలుకలు = వజ్రశకలములు కూర్చిన. రావిరేక = రావియాకువంటి, చిఱుగజ్జియలు = చిన్నగజ్జెలుగల. అందియలు = అందెలు. ఆయిదంచులుగల యపరంజిబిళ్ళ గలిగిన బంగారపుపతకము. తుదిగన్ = చివర నుండునట్లుగా. పులిగోరును = పులిగోరు గూర్చిన యాభరణము, పుట్టువెండ్రుకల్ = పుట్టువెండ్రుకలును, చెలగెడిుపట్టి = చలించుచుండునట్టి శిశువు.

శా.

ఆలోలాస్యవినీతనూపురపదాజాంగుష్ఠము న్నిస్రవ
ల్లాలాజాలము కేళిధూళిపటలీలబ్ధాంగమున్ హస్తచే
ష్టాలగ్నేక్షణకజ్జలాన్వితముఖాబ్జాంతంబునై మించు త
ద్బాలత్వం బొగి తల్లిదండ్రులకు దృక్పర్వంబు గావింపదే.

22

12. ఆలోల = చలించుచున్నట్టి. ఆస్య, వినీత = నోటియొద్దకుఁ దేఁబడిన, నూపుర = అందెగల, పదాబ్జాంగుష్ఠమున్ = పద్మమువంటి