పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

51

పరస్పరము నమ్మగారు కుమారునిఁ గన్నవేళ సంతోషముతో సరసము లాడుకొనుచుండుట యీపద్యమందు వర్ణింపఁబడెను.

క.

తోరపుఁ జనుఁగ సదర నొ
య్యారంబున వచ్చి యంత యంతఃపురకాం
తారత్నము విభునకు దే
వేరి సుతుం గన్నవార్త వినిపించుటయున్.

12

12. చనుఁగ వదర = చనుఁగవ + అదర. శేషము స్పష్టము.

మ.

పులుకల్ బిట్టర చట్టియందు నిలువన్ బొల్పొందె హర్షంబునన్
మొలకల్ డెందమునన్ బరంపరలుగా ముంచెన్ సముద్బాష్పము
ల్గలిగె న్నిద్దపుఁ జెక్కుటద్దముల సోగల్వారెఁ జెల్వారఁగా
నల భూజానికి నాత్మజాతకుని వార్తాకర్ణనాపూర్ణతన్.

13

13. పులకల్ = రోమాంచములు. బిట్టరచట్టి = మిక్కిలి నిక్కవొడిచి. అంద = అంకురించినచోటనే, నిలుపన్ = అణఁగిపోక యుండఁగా. పొల్పొందెనని పూర్వమున కన్వయము. హర్ష...ముంచెన్ = సంతోషముతో, తదంకురములు, మనస్సునందు, సమృద్ధిగా ముంచెను. అనఁగా వ్యాపించెననుట. సముద్బాష్పముల్ = ఆనందయుక్తమయిన నేత్రజలబిందువులు. శేషము స్పష్టము.

గీ.

దూరయాత్రాగతుఁడు తనయూరు గనిన
కరణి, తృష్ణార్తుఁ డమృతంబు గాంచు సరణి,
ఖరకిరణఖిన్నుఁ డొకచెట్టు గన్న పగిది,
నందనోదయవార్త నానంద మొంది.

14