పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజవాహనవిజయము


పూర్ణగర్భంబు దాల్చె నంత నగణ్యసాద్గుణ్యంబగు నొకా
నొకపుణ్యవాసరంబున.

9

9. సువర్ణన్ వర్ణన్ = బంగరువన్నె గలది. అనగా స్త్రీ,

క.

పంచగ్రహమిహిరుని వ
ర్తించని లగ్నమున దిశలు తేజము మించన్
బంచాస్యమధ్యధీరుం
బంచాస్త్రాకారునిం గుమారునిఁ గాంచెన్.

10

10. సూర్యాదిక్రూరగ్రహము లయిదును లేని లగ్నమునందు అనఁగా బృహస్పతి, చంద్రశుక్రులుగల లగ్నమునం దని భావము.

సీ.

మనరాజుతోడ ధీమంతు లూహ యొనర్చి
                 చెప్పిన వీసంబు తప్ప కగునె
చామనిచాయదాసరి ముత్తె మిచ్చిన
                 కల మొన్న మునుమాపు దెలుపవలెనె
యమ్మ కుమారుఁగన్ సుమ్మన మరచితె
                 పున్నమనాఁడు నే నన్నమాట
లటు మున్ను నీకు నీయాన నే నేమంటిఁ
                 బడకింటిపజ్జుఁ జప్పరములోన


గీ.

నగునె నీకల నిక్కల యక్క నీదు
పలుకు తప్పదు తాగట్టి పలవ యిచ్చు
ననుచుఁ దమదేవి సుతునిఁ గన్నపుడె తగిలి
నగవు చిరుగింప నగిరి పూర్ణగిరి చెలులు.

11

11. వీసము = పదియారింట నొకభాగము. చామనిచాయదాసరి = వేంకటేశ్వరుడు. నిక్కల = నిండుకల. పూర్ణగరి చెలులు = పట్టణమందలి నగరునఁ దిరుగు నూడిగపుటాండ్రు, వీండ్రు