పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

45

కుబ్జయను పేరుగల మఱుఁగుజ్జుదానియొక్క నేత్రముల కంకురించు వీటరాయుఁడా, అనఁగా త్రివక్రను అవక్రను జేసి దాని యిష్టము తీర్చెననుట.

క.

నందకధర యభినందిత
నందకటాక్షా రమాంగనామణిహృదయా
నందనచందనయానక
దుందుభి నందన విధూత దుందుభిదేహా.

84

84. నందకధర = స్పష్టము.

ఉత్సాహము.

మందరాగనిత్యధృత్యమందరాగ దానపౌ
రందరాగ వాగ్గళన్మరందరాజిభారతీ
కందరాజిశోభినాభికందరా ముకుంద గో
విందరాజినందితారవిందరాజితేక్షణా.

85

85. మంద... రాగ = మందరశైలమును నిల్కడగా ధరించుటయం దధికాపేక్ష గలవాఁడా. దాన.. రాగ = దానకల్పకమా, వాగ్గళ... భారతీ - వాక్కు నుండి బహిర్గతమగు తేనెసోనగల వేదములు గలవాఁడా. కంద...కందరా - మూలాంకురసమూహముచేఁ బ్రకాశించునాభిబిలము గలవాఁడా. ముకుందా - మోక్షమిచ్చువాఁడా. గోవిం...క్షణా - దిక్పాలగణమును సంతోషింపఁజేయునట్టి పద్మమువంటి ప్రకాశించు కన్నులు గలవాఁడా.