పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

రాజవాహనవిజయము


కల్యాత్తగాత్ర నహల్యాంబురుహనేత్ర
                 గల్యాణిఁ జేయు నైర్మల్యశాలి


గీ.

యల యశోదాకిశోరకం బాసుభద్ర
కలికి సైదోడు నాపాల గలిగె నేఁడు
మమ్మరే యని పులకించి మందయాన
తుందిలానందకందళికంద మయ్యె.

82

82. సత్యభామకు కల్పవృక్షము తెచ్చియిచ్చినవాఁడు, ద్రౌపదికి నవమానము తప్పించినవాఁడు. (వస్త్రాపహరణమందు) అఱన్ = హరింపన్, పరిక్షిత్తును గాపాడినవాఁడు. కల్యాతగాత్ర = దోషగ్రస్తశరీరము మమ్మరే = ఆశ్చర్యార్థకము. తుందిలానందకందళికందము = బలిసిన సంతోషపుమొక్కకు దుంప.

శా.

అబ్జాతప్రభవాదివంద్యహృదయాధ్యాహా లసాధ్యేతరా
కుబ్జాకార మహత్త్వసత్వకలనా కుంఠీకృతాస్తోక కా
కుబ్జాగ్రద్గజశంస కంస కరటిక్షోభోగ్రబాహార్గళా
కుచానామనికుబ్జపాణి నయనాంకూర ద్భుజంగాగ్రణీ.

83

83. హృదయాధ్యాహాలసాధ్యేతరా = మనస్సుచే నధ్యాహరించుట కసాధ్యుఁడా, మానసాగోచరుఁ డనుట, కుట్టాకార = వామనస్వరూపుఁడా, మహత్వ ... శంస... మహిమ యొక్క, బలక్రమముచే వ్యర్ధపరచఁబడనివియు, నధికమైనట్టియు, గజేంద్రుని స్తుతిగలవాఁడా. అనఁగా గజేంద్రునిఁ గాపాడె ననుట. (కకుబ్జాగ్రద్గజస్యాపతంయంపుమాన్ - కాకుబ్జాగ్రద్గజః - తస్యశంపాయస్యతి విగ్రహః) కులా......గ్రణీ =