పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

43

79. హరిదశ్వయాత్రకు = సూర్యునియాత్రకు. అమరే...క్తిన్ = ఐరావతకుంభస్థలిమీఁద అసమయభటాగ్రేసరుఁడు = కాలమనెడు భటశ్రేష్ఠుఁడు. కెంపుడాలు = ఎఱ్ఱని జెండా, అరుణఁపుడాలు = ఎఱ్ఱకాంతి.

క.

తమ్ములదొర కైరవజా
తమ్ములచెఱ చక్రసంయుతమ్ములకొఱ భూ
తమ్ములతొర యాగమకుం
తమ్ములయొఱ కిరణధనుఁడు తపనుఁడు పొడమెన్.

80

80. చెఱ =నిర్బంధము. చక్రసంయుతమ్ములకొఱ = చక్రవాకదంపతులయక్కఱ, భూతమ్ములతొర = పిశాచములకు వేగిరింపు. సూర్యోదయము పిశాచములకు నిర్బంధమనుట. ఆగమకుంతమ్ములయొఱ = వేదములనెడు బల్లెములకు గూడు. త్రయీమూర్తి యగుటచేతనని గ్రహించునది. కిరణధనుఁడు = సూర్యుఁడు (కిరణములే ధనముగాఁ గలవాఁడు).

క.

అంతకయె మున్ను కాంతయు
నెంతయు మేల్కని మురారిహృదయగతోద్య
త్సంతోషబాష్పకళికా
క్రాంతనిరంతరితపులకగండయుగళయై.

81

81. అంతకయె = స్పష్టార్ధము.

సీ.

అత్యాదరమున నాదిత్యావని రుహంబు
                 సత్య కిచ్చిన నిత్యసత్యఘనుఁడు
కృపఁ దారసిలు చూడ్కి ద్రుపదాత్మభవనప
                 త్రపదొర నీని తద్విపదరాతి
యుత్తరనృత్తలోకోత్తరతసుజాతు
                 నొత్తరం జేయు నమత్తరతుఁడు