పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

రాజవాహనవిజయము


గీ.

సంభవించెఁ గచాకచీసంగరంబు
చక్కఁగా వేగ దిక్కులఁ జాటనేఁడు
దండహతు లొదనెను వెల తలిరుబోండ్ల
తల్లులకుఁ దూర్పు తెలతెలల్ దాయు నపుడు.

77

77. శ్రమపరిశ్రమ... సంభ్రరమమున = అలయికతో కూడిన యన్యోన్యాలింగనాతిశయమువలని సంతోషముచే. సంకేత... ప్తిన్ = సంకేతస్థానములనుండి నిశాప్రతిబంధకాభావస్థలముయొక్క ప్రాప్తిచే ప్రతిష్ఠితజనంబు = మర్యాదవంతులు, తపనోదయమిషన్ = సూర్యోదయపునెపముచే. అలపనోద్ధతులన్ = చురుకయిన మాటలతో. కచాకచీసంగరంబు = జుట్ల జుట్లు పట్టుకొని చేయుపోరు. ఒకచోటునకే తటస్థించి వెలుపలికి వెడలింపఁబడ్డ విటులు పోట్లాడుచుండిరనుట. దండహతులు = కఱ్ఱదెబ్బలు.

ఉ.

చల్లనితావి నెల్లెడలఁ జల్లఁగఁ దెమ్మెర లెల్లఁ బెల్లుగా
హల్లకము ల్సనిద్రకములై పొరలం జలజాతజాలముల్
మొల్లమి నుల్లసిల్లఁ దమముం దమ ముందటిచోటు కేగగా
బల్లునఁ దెల్లవారె సుమభల్లరణార్థుల గుండె ఝల్లనన్.

78

78. హల్లకములు = ఎఱ్ఱగలువలు. సుమభల్లరణారిథులు = రత్యపేక్షకులు.

క.

హరిదశ్వయాత్ర కమరే
శ్వరదిగ్గజకుంభపఙ్క్తిసమయభటాగ్రే
సరుఁ డెత్తు కెంపుడాలన
నరుణపుడా లడరెఁ బ్రాచి నప్పటివేళన్.

79