పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

41

74. సంతానార్థిని = సంతానమును కాంక్షించు, అసురజిష్ణుండు = రాక్షసులను జయించినవాడు.

గీ.

అంత మాగధవైతాళికాతతిమంజు
లారవంబుల మేల్కని హరి వరంపుఁ
బెంపునఁ దదాస్యకళ హెచ్చి సొంపు మీఱు
ననుచు మును జాఱెనా నెల యపుడు క్రుంకె.

75

76. మాగధ...... రవంబుల, మాగధ = భట్టువాండ్రయు, వైతాళిక = మేల్కొలుపులవాండ్రయు అతిమనోహరములయిన స్వరములచే, తదాస్యకళ = రాజు భార్య యొక్క ముఖకళ, మునుజరెనాన్ = ముందుగనే జారెనో యనునటుల. నెల = చంద్రుడు.

విష్ణువరమహిమచే రాజపత్నీముఖకళ హెచ్చునని తలంచి చంపుడు దిగజారెనో యనునటుల నస్తమించెను.

గీ..

చుక్కరాయల్లు దొరకేళి మక్కువలన
జొక్కు వారును చుక్కనాఁ జుక్క వొడిచెఁ
దెల్ల దీపంబుగా బ్రాక్సతీముఖంబు
తెల్లవారఁగఁ దూరుపు తెల్లవారె.

76

76, చుక్కరాయల్లు......మక్కువలన = మోహములచేతనే, ఉచుక్కునా = నిరసింపఁగా.

సీ.

శ్రమ పరస్పరపరిరంభజృంభణసంభ్ర
                 మమున నిద్రించె దంపతిగణంబు
సంకేతతలనిశాతకీతరతలాప్తిఁ
                 జనుదెంచె నిండ్లకు జారసమితి
గణిగాశిరోమణి మణితాబ్ధి దేలి వ
                 చ్చె ముసుం గెసఁగఁ బ్రతిష్ఠిథితజనంబు
తపనోదయమిషనాలపనోద్ధతుల నిండ్లు
                 వెడలఁద్రోచె విటాళి వేశ్యమాత


..

--