పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

రాజవాహనవిజయము

రాహుకేతువులు (వీరిని) గ్రస్త = గ్రసించిన, కత్తృర్థక కర్తృప్రత్యయము. తాపవారకులగునట్టివారు, మనోహరులై ప్రకాశించునట్టియు, చంద్రసూర్యులు, చక్రశంఖములు తమోగ్రహములను మ్రింగునట్టి, తాపకరము గానట్టి, సర్వదా ప్రకాశించునట్టి సూర్యచంద్రు లనుట. పుష్పవంతులు = సూర్యచంద్రులు, గద తామరతూడుగ నభివర్ణింపబడెను. అందెపైఁ జెక్కిన రాజహంసకు నిచ్చు తూఁటిని బోలి గద యుండె ననుట. పసిఁడిచేలచెరగు, చందన... ...భోగము = శ్రీగంధవృక్షము నడుమును జుట్టిన సర్పముయొక్క శాఖాపంక్తిభాగభాక్కగు బహురత్నయుక్తఫణమువలె నుండెను.

శా.

ఛాయల్ చేరిన జాళువామొసలివాచౌకట్లు లేజెక్కులన్
సాయంకాలదినేంద్రమండలము గుందన్ జేయ గాంగేయకౌ
శేయం బాయతకాయతోయదముపై చిందుల్ గొనన్ రేవతీ
దాయాదుం డల రాజరాజముఖిచెంత న్నిల్చి యంతన్ దయన్.

73

73. ఛాయల్ .....ట్లు, ఛాయల్ దేరిన = వన్నెమించిన, జాళువా = బంగారుతోఁ జేయఁబడిన, మొసలివా = మకరముఖాకృతి గల, చౌకట్లు = కుండలములు, సాయంకాల, దినేంద్ర, మండలము = అస్తమయసూర్యమండలముసు, గాంగేయకౌశేయము =సువర్ణాంబరము, కాయతోయదము = దేహ మనెడు మేఘము, రేవతీదాయాదుండు = బలరామునకు బాలివాఁడు, రాజరాజముఖి = రాజకాంత.

క.

సంతానార్థిని యువతికి
సంతానఫలం బొసంగి సంతతజనతా
చింతాసంతాపహరణ
చింతామణి విష్ణు డసురజిష్ణుం డరిగెన్.

74