పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

39


గీ.

కడలి బొడమిన నిగ్గు చొక్కంపుగెంపు
రొమ్మువాఁడు నెమలికుంచె సొమ్మువాఁడు
క్రీడిచేడియ సడి విడనాఁడువాఁడు
కొండకూటువ పగవాని కూర్మితోఁడు.

71

71. లిబ్బులజవరాలియబ్బ = సాగరుడు, వానిజామాతగాఁ జేసిన పాదపద్మముగలవాఁడు. నెలదాల్సు, నేవళంబులు = శివుని యాభరణంబులు, సర్పంబులు, వేల్పుబోనము= అమృతము, వారువము = గుఱ్ఱము అనగా గరుత్మంతుడు పూర్వము స్వర్గమునుండి యమృతము తెచ్చి వాసుక్యాదుల కిచ్చి తనతల్లిని దాస్యమునుండి తప్పించెను. గొంతి మూఁడవపట్టి కోడలు = ఉత్తర. కొండకూటువ పగవాఁడు = ఇంద్రుడు.

సీ.

వలకంటి యెండకై వనధిజాతకులై జ
                 యంతివట్టిన హొయలఱిగె యనఁగ
మస్తపంబోదరగ్రస్తతాపహరణై
                 కాంతభాస్వరపుష్పవంతు లనఁగ
హంస కాశ్రితరాజహంసంబున కొసంగు
                 లీలార్ధమృదులమృణాల మనఁగ
చందనద్రుమమధ్యసక్తాహివిటపాళి
                 భాగభాగ్బహురత్నభోగ మనఁగ


గీ.

రొమ్ముపై మచ్చయరియుఁ జిందమ్ము గదయు
నడుముచుట్టు వెన్నంటి కుడిభుజమున
వాలి చనుమొన నటియించు చేల పసిఁడి
చెరగు మెరు గార వచ్చి లక్ష్మీధవుండు.

72

72. ఈ పద్యమున శ్రీవత్సము, చక్రశంఖములు, గద, స్వర్ణచేలము ఇవి వరుసగ వర్ణింపబడెను. వలకంటి యెండ = సూర్యతాపము, హొయలఱిగె = ఒయారపుగొడుగు. మస్తపంబోదరు లనఁగా