పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

రాజవాహనవిజయము


నుండునో నాఁగఁ దూరుపుకొండదండ
పాండురాకృతిఁ బొడసూపెఁ బాండుకరుఁడు.

69

69. పదాంగదము = అందె, ఇనుఁడు = సూర్యుడు. శివుఁడు ప్రదోషతాండవవేళ కాలు జాడించుచో నూడిపడ్డయందె యనునట్లు సూర్యుఁడు గ్రుంకెననుట. తేఁటి సుడివలె నమరించిన కాసె (నడుముదట్టి) యనునట్లు సంజెయొప్పె. శబ్దజతి గొనగొల్పుటకై శివజటపటలిని ఘూర్ణిల్లెడు గంగనుండి పైకి లేచిన జలబిందువులనురీతిఁ జుక్కలు వెలిసెను. శివుఁడు గొంతున నుంచుకొనలేక యమిసిన హాలాహల మనునట్లు చీకటి వ్యాపించెను. ప్రదోషతాండవవేళ శివుడు నిజైశ్వర్యమున రాణించునప్పుడు చంద్రుఁడు తనమండలమం దుండుటకో యనునట్టు తూర్పుకొండపై నొప్పెను.

క.

ఆ రాత్రి సముజ్వల మ
ణ్యారాత్రికుఁ డగుచు సప్రియకుఁడై క్రీడా
గారంబున శయనింపఁగ
గౌరవఖని యౌ తదీయకలకంఠి కలన్.

70

70. మణ్యారాత్రికలు = రత్నహారతులు. తదీయకలకంఠి = రాజహంసునిభార్య.

సీ.

లిబ్బుల జవరాలియబ్బ వల్లునిఁ జేసి
                 తనరెడు నడుగు కెందమ్మివాఁడు
సిరి యిల్లు మేల్కన జేసి జేజేలకు
                 వంటకంబికు కన్నుదంటవాఁడు
నెలదాల్పు నేవళంబులకునై వేల్పు బో
                 నమ్ము దెచ్చిన వారువమ్మువాఁడు
గొంతి మూఁడవపట్టి కోడలి నిండులే
                 కటిఁ గాచినట్టి చేకత్తివాఁడు