పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

37


క.

రసికాంబుజహంసుఁడు సా
హసికవతంసుండు రాజహంసుం డెపుడుని
వసుమతి యను సుదతీమణి
వసుమతిఁ గులకాంతగాఁగ వర్తిలుఁ గీర్తిన్.

67

67. వతంసుండు = అవతంసము = ఇట్లు వలగ్నము, అవలగ్నంబు మొ-

వ.

ఇవ్విధంబున సౌగంధికబాంధవకులీనసింధురంబు,
గంధసింధురసైంధవ ప్రియంభావుక భావుక భూ
మ్యంగనాభోగధురంధరుం డష్టైశ్వర్యశితికందరుం
డాభోగపురందరుండు, జీమూతజాతంబునకుఁ జాత
కంబునుంబోలెఁ దనూజాత జాతకంబునకు నెదురు
చూచుచుండె నంత నొక్కనాఁడు.

68

68. సౌగంధికబాంధవ = చంద్రుఁడు. జీమూతము = మేఘము.

సీ.

శూలిసంధ్యానాట్యకేళి మున్నూడఁ ద
                 న్నిన పదాంగద మన నినుఁడు గ్రుంకె
భ్రమరవిభ్రమరీతి నమరించు చెంగావి
                 కాసెనా సంధ్యాప్రకాశ మెసఁగె
శబ్దంబు గొనగొల్పు సజటాతటి న్యుద్ధ
                 జలకణంబులన జుక్కలు చెలంగె
మృడుఁడు తాళఁగలేక పుడమిపై నుమిసిన
                 గళ హలాహలమన గడిసెఁ దమము


గీ.

లీలమైఁ బాడ నటనకానీలలోహి
తుండు నిజభూతి రాణింప మండలమున