పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

రాజవాహనవిజయము


ర్ణాటోపాళిపరిస్ఫురత్ప్రదితసర్వాశావధూటీకుచా
ఘాటాచ్ఛాచ్చదరాగశాటితసమాఖ్యావిక్రమప్రక్రమా
త్యాటీకాహితరాజహంసుడగు నాహా రాజహంసుం డిలన్.

65

65. దండాన్వయము. దండయాత్రయందు గుఱ్ఱాలడెక్కెలకొనలచేఁ పిండిగఁగొట్టఁబడిన భూపరాగమనెడు బుక్కాపొడియొక్క యతిశయముయొక్క వరుసలచేఁ బ్రకాశించునట్టియు, ప్రసిద్ధములగు సకలదిశలనెడు స్త్రీలకును (వారి) కుచంబుల పంక్తులకును (వరుఁగ) తెల్లచీరగను, నెర్రనిపైబట్టగను, జేయఁబడిన కీర్తిప్రతాపముల ప్రచారములయొక్క ప్రకాశమునకు నిరోధులైన చంద్రసూర్యులు గలవాఁడు.

గీ.

అబ్జదానత శుద్ధపక్షాప్తి విమల
మానసస్థితి నడవడి మహితకీర్తి
పరిచయంబున నాత్మభూభరణశక్తి
రాజహంస ప్రభావంబు రమణ గాంచు.

66

66. అబ్జదానత = చంద్రుని దాతృత్వమువంటి దాతృత్వము గలవాఁడనుట. పద్మములను ద్రుంచుట = ఈయర్ధమందు భావార్ధక తల్ ప్రత్యయము వ్యర్థమగుఁగాన నీపక్షమందును బహువ్రీహినే గ్రహింపదగు. శుద్ధపక్షాప్తి = నిర్దోషకక్ష్యాలంబనము, స్వచ్ఛమగు ఱెక్కలు గలుగుట, విమలమానసస్థితి = నిర్మలమనస్సు గలిగియుండుట - మానససరస్సున నుండుట. కీర్తి = యశస్సు, బురద = ఆత్మ, భూభరణము = తనదేశము భరించుట, బ్రహ్మను మోయుట. రాజహంస ప్రభావము = రాజ శ్రేష్ఠుని మహిమ, రాజహంసము = చంచు చరణము లెఱ్ఱగను దక్కినశరీరము తెల్లగను నుండు హంస.