పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

35


సూటిగల దెంపు కోటాని శుద్ధసలిల
పరిఘ యొప్పారు నెప్పు డప్పురవరమున.

62

62. కట్టాణి = మౌక్తికవిశేషము, కుత్తుకంటు = స్త్రీలు మెడ మధరించు సుమంగళ్యలంకారవిశేషము. దైవపద్యా = ఆకాశము, చక్రి = శేషుఁడు, శేషునకును వాయువునకును గల్గిన బలతారతమ్యవివాదలో వాయువు మేరుపర్వతము నెగరఁగొట్టుటకుఁ చేయుప్రయత్నము నెరవేరకుండుటకు శేషుఁడు మేరువును జుట్టనేసెనని గాథ గలదు. ఇక్కడ బంగరుకోట మేరువుగను నగర్త శేషుఁడుగను జెప్పంబడెను. సూర్యసంపుటమను పెద్దయోఘ ప్రాకారమును స్పృశింపగా పట్టమనెడు యోధు కట్టిన కాసికోక యనునట్లు. సూటిగల = గుర్తుగలిగిన, కోటాని = కోటనానుకొని, పరిఘ = అగడ్త.

క.

ఆ వెలికడలి న్నగు పరి
ఘావారిధిఁ దత్పురంబుఁ గని చతురుండై
రావణపురి యామీఁదటఁ
గావించెనొ కాక విశ్వకర్మకు నగునే.

63

63. వెలికడలి = పాలసముద్రము, అగునె = శక్యమా.

క.

ఆపట్టణమున కీశ్వరుఁ
డై పాటీలు రాజహంసుఁ డతఁడు ప్రతాపా
టోపాహతకోపానత
భూపాయతధైర్యశౌర్యపుటభేదనుఁడై.

64

64. ప్రతా...నుఁడై= ప్రజాపాతిశయముచే గొట్టబడని కోపమునకు ననతు లైన రాజులయొక్క విస్తారమగు ధైర్యశౌర్యపుటమును భేదించినవాడై పాటిలునని యస్వయము.

శా.

ధాటీఘోటఖురాగ్రనిర్దళితగోత్రాధూళికాగంధచూ