పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజవాహనవిజయము


గీ.

జటులబృంహితబధిరితాశాగజముల
కేల కడుపెద్దవిన్నప మిపుడు సేయ
నహిపతికిఁ దోఁడు కైయంచు నవని నొడలఁ
గరము వహియించు నవ్వీటికరటిఘటలు.

61

61. చరణ...దృక్కర్ణుఁడు = శేషుడు. ఏనుగుల పదవిన్యాసముచే భూమి దించుకొని పోవుచున్నందున శేషునికి శిరోభారము వచ్చి కంటికిఁ గలిక మడుగుచుండెనని భావము. ఈచరణమందుఁ బదవిన్యాసము ప్రశంసింపఁబడె. ఏనుఁగుచెవులవలనివాయువుచే వృక్షములు విరిగిపడిపోవుచున్నందున నింద్రుడు గాలిని నేరగానిగా నాటంకపఱచుచున్నాడు. దంతఘట్టనలచే మేరువునుండి పడుచున్న ధూళీసమూహమువల్లఁ కలుషములైన గంగోదకములను జటలువడియగట్టుచున్నాడు. ఉడుప = నక్షత్రపతి, తెప్ప, గజకర్ణములు, దంతఘట్టనలు, కరశీకరములు వర్ణింపబడె. ఈయేనుఁగుల ఘీంకారమునకు దిగ్గజములకుఁ జెవుడు పట్టెను. శిరోభారము గలశేషుడు చెవిటియేనుఁగుల సహాయమునకై వానికిఁ బెద్దమొఱ్ఱె లేల పెట్టవలె మేము లేమా యంచుఁ బట్టణగజములు తమదేహముపై భూమిని వహించుచున్నవి అనగాఁ బరాగము పైవేసికొనుచున్న వనుట.

సీ.

ధర కుంకుమాంకకంధర దాల్చికొన్న క
                 ట్టాణిపూసలకుత్తుకం టనంగ
గట్టువిల్తుడుఁ జడచుట్టు చుట్టుక నిల్పు
                 దైవపద్యానటత్తటిని యనఁగఁ
బవనుతో వాదంబు పచరించి హాటకా
                 చలము చుట్టున నాటు చక్రి యనఁగ
సూర్యపుటంపు బల్జో దంటఁగట్టిన
                 పట్టణాభిధయోధుదట్టి యనఁగ


గీ.

దేవపురలక్ష్మి కురువిందకోవక్రిందఁ
దార్చు కొండియ మొదటిపూదండ యనఁగ