పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

33

విటుల భాగ్యములని అర్ధాంతరము. విటపాళి = వృక్షములపంక్తియని అర్ధాంతరము. హారిభావము = ఒప్పిదము. కామనశ్రీఫలాక్రమణ = సొగసైన మారేడుపండ్లను, అలుముట. (కాముకుల యైశ్వర్యలాభము నలుముట), ఏటిబోటిగములలోన = ఎటువంటి స్త్రీలలోను, నూటి = నిదానము. వాటివాటికి = అప్పటికప్పటికి, వేశవాటికా = వేశ్యలవీథి, ఝూట = సమూహము.

ఉ.

రౌతు మనం బెఱింగి జలరాశి చివుక్కున దాటి హుంక్రియా
జ్ఞాతత నాగు వాగె కుఱుసన్న ఘటింపదు సాటీ చుట్టుఁ గ
ద్దాతలఁ బెట్టునో యనుభయంబున శిక్షణవేళనుం గశా
ఘాతము లేక యుండు టెఱుంగంబడుఁ దత్పురి వాజిరాజికిన్.

60

60. వాగె కుఱుసన్న = కళ్లెమువలని చిన్నిసన్న. ఘటింపదు = పదయదు, సాటి = సమానాశ్వములు. చుట్టుగద్ద = చుట్టుపట్ల కలవు. ఆతలఁ బెట్టునో = కడగా నిల్పునేమో. శిక్షణవేళను = గతివిద్యావేళనైనను. ఎఱుఁగంబడు= తెలియంబడును.

సీ.

చరణవిన్యాసబంధురశిరోభారదృ
                 క్కర్ణుఁడు కంటికిఁ గలిక మడుగఁ
గర్ణచాలనపతత్కల్పద్రుకుపితేంద్రు
                 డపరాధి వని గాడ్పు నడ్డ పెట్ట
రద దశ న్మేరూద్ధరాజసావాప్తాభ్ర
                 తటనివారికి జటు ల్పటములందఁ
గర మెత్తి చల్లు శీకరపువెల్లిని జుక్కి
                 లుడుపబింబం బెక్కు నుడుప శంకఁ