పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

రాజవాహనవిజయము


చిప్పిల్ కప్రఁపుఁదావి మోవి యపరంజింబెక్కు లేఁజెక్కు బా
గొప్పుల్ గుప్పు పిఱుందుపెంపును విటవ్యూహంబు జొక్కింపఁగా
నప్పా! యప్పురిఁ జెప్ప నొప్పుదురు రూపాజీవికారత్నముల్.

58

58. ఆప్పా = ప్రశంశనార్థకము, రూపాజీవికారత్నములు = ఉత్తమవేశ్యలు.

సీ.

ఔరార! మధురాధరారుణ్యమే చాలు
                 బల్ల శ్రేణి సంపద హరింప
మజ్జారె! వేణికామైచక్యమే చాలు
                 నల భుజంగశ్రీల నపహరింప
భళిర! భుజాలతావిలసనంబే చాలు
                 గట్టిగా విటపాళి గట్టివైవ
నయ్యారె! వక్షోజహారిభావమె చాలుఁ
                 గామనశ్రీఫలాక్రమణ సేయ
ననఁగఁ బాటిల్లుఁ దనపాటి యైన సాటి
యేటి బోటిగములలోన సూటి నాటి
నాటి కవ్వీటిలో వేశవాటికావ
ధూటికాకోటి గుణమణీఝూటపేటి.

59

59. అరుణ్యము = ఎరుపు, పల్లవశ్రేణి = చిగుళ్ళ సమూహము. విటసమూహమని అర్థాంతరము. ఔరా = మజ్ఝారే మొదలైనవి ప్రశంసనార్థకములు. మైచక్యము = నలుపు, భుజంగశ్రీలు - కృష్ణసర్పశోభలు.