పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

31


క.

ఏరికి నెగ్గులు తేకూ
రూరికి మోచుకొని తిరుగు నొకముసలియు నే
డేరు గలిగి యొకయెద్దున
బోరు దిగంబరుఁడు సరియె పురి కాపులకున్.

56

56. ఏరికి = నాఁగటికి, ముసలి = వృద్ధుడు, బలరాములు ఏఱు = శిరస్సున గంగ.

సీ.

ఎత్తుమాయని పూవుటెత్తింత యెత్తించి
                 కక్ష నఖక్షతాంకంబుఁ జూచి
వెలయెంత యీమల్లికల కని పలికించి
                 గుత్తంపుమోవిప ల్లొత్తుఁ గాంచి
కొమ్ము పైకమ్ము లీకమ్మజాజుల కని
                 చూచుమిటారంపుఁజూపు దెలిసి
యడిగిన పైఁడి యీముడిపువ్వుల కొసంగ
                 నగునని వెసనగు మొగ మెఱింగి


గీ.

యొక్కఁ డిడుచోట నలుగురు రొక్క మిడిన
విటులఁ దెలుపుచుఁ దావుల విరుల సరుల
గూర్చి యమ్ముదు రవ్వీటఁ గులుకు గుబ్బ
జవ్వనపురాండ్రు పువ్వుల పువ్వుఁబోండ్లు.

57

57. ఎత్తుమా= పైకి పెట్టుమా, పూవుటెత్తు = పూదండ, పల్లొత్తు = దంతక్షతము, అడిగిన పైఁడి = అడిగి రొక్కము, ముడిపువ్వులు = వికంపని పువ్వులు.

శా.

కప్పుం గొప్పులచొప్పు గొప్పమెఱుఁగుం గందోయిడా ల్తేనియల్