పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

రాజవాహనవిజయము


రెండవదుంత లే కుండెఁగా కినసూతి
                 రొంపిలో దుక్కిచా ల్నింపినాఁడె
పగ్గ మగ్గలికచే పట్టెఁగా కప్పతి
                 గట్టిగా నొకయేఱుఁ గట్టినాఁడు


గీ.

నాఁడు నేడును దమ కీఁడు లేఁడటంచు
గొడ్డలాగుదు రొండొరు లొడ్డులేక
జెడ్డదుగమోముదొర టెంకిబొడ్డుదమ్మి
దొడ్డవేలుపు లడుగీను బిడ్డ లచట.

54

54. జెలుగు = జలోఛ్వాసంబు. వేరువిత్తుగ = మూలంబు నాటునటుల, దుంత = మహేషము, ఇనసూతి = కాలుడు, అప్పతి = వరుణుడు, గొడ్డలు = ప్రౌఢోక్తులు, బిఱుసుమాటలు, ఒడ్డు = సామ్యంబు. జెడ్డదుగమోముదొర = బ్రహ్మయొక్క, టెంకి = ఉనికిపట్టయిన, బొడ్డుదమ్మి = నాభికమలము గల, దొడ్డవేలుపు = విష్ణుదేవునియొక్క, అడుగీనుబిడ్డలు = పాదజులు = శూద్రులు.

క.

మాన్యబహువ్రీహియనం
ధన్యస్తవనంబు గన్నఁ దత్పురవరసౌ
జన్యచతుర్థాన్వయచయ
మన్యపదార్థప్రధాన మై యుండ దహా!

55

55. మాన్యబహువ్రీహి = మన్నింపఁదగ్గది బహువ్రీహిసమాసము గలది. ఇది శూద్రచయవిశేషణము. అన్యపదార్థప్రధాన మయ్యుండదు = ఇతరుల ద్రవ్యంబు ముఖ్యంబుగా గలది అయ్యుండదు. బహువ్రీహిసమాసము గలది కాదనుట. ఇది శూద్రచయవిశేషణము. విరోధాభాసాలంకారము.