పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

29


క.

కలనికి నర్హుఁడె రఘుకుల
తిలకునకు న్మేటిబంటు తెలిసె నటంచుం
దలఁచిరి భార్గవుఁ గినిసినఁ
గొలువునకుం దార్పలేరొకో పురిరాజుల్.

51

51. స్పష్టార్ధము.

క.

విశ్వమణిసంగ్రహణ శౌ
రి శ్వశురులు భోగశౌచరీతి తురాషా
డ్వైశ్వానరు లగుదురు ని
త్యైశ్వర్యకుబేరవిజయు లప్పురి వైశ్యుల్.

52

52. శౌరి శ్వశురులు= విష్ణుని మామలు అనగా సాగరులు.

క.

శ్రీవరనిలయులు వసువిస
రావితబాడబులు మింతు రచ్చటి బేరుల్
కావేరీవల్లభులనఁ
గా వేరేవారు సాటి గా రేరీతిన్.

53

53. శ్రీవరనిలయులు = లక్ష్మిచే గొప్పయిన గృహంబులు గలవారు. వసువిసరావితబాడబులు = ధనసమృద్ధిచే పోషింపబడ్డ బ్రాహ్మణులు గలవారు. కావేరీవల్లభులు = సాగరులు. వేరు + ఏవారు సాటిగారు = స్పష్టము. రత్నగాంభీర్యంబులచే అని తెలియవలయును..

సీ.

దినకరాత్మజ కల్గు దీర్చెఁగా కబలుండు
                 వేరువిత్తుగఁ బైరు విత్తినాఁడె
తల నేరు మోచెఁగా కలికనేత్రుడు కాల్వ
                 నిగిడించి పొలము దున్నించినాఁడె