పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

రాజవాహనవిజయము

కాలమందని) అజడులు = జడభావము లేనివారు (జడము = జలము ఇట లడల కభేదము) గండము = కొండపైనుండి భూకంపాదులచే దొర్లిన పెద్దరాతిగుండు. అపాయమని అర్థాంతరము. స్రష్టాదుల యందుండు స్వభావధర్మములైన నలుదెసలు చూచుట మొదలయినవానిచే వారియందు లోప మారోపింపబడుచున్నది. న్యూనాభేదరూపకాలంకారము. -చతురాస్యత = చతురవాగ్మిత్వము, చతుర్ముఖత్వము, అహీనత = అధికత్వము, శేషత్వము, కళానిధిత్వము, విద్యాయత్వము, కళలకు స్థాన మగుట. విష్ణుపదసక్తి = విష్ణుచరణసంయోగము, ఆకాశసంబంధము (బృహస్పతిపక్షమందు), స్థిత = ధైర్యము, చలింపమి (భూపక్షము), ఊర్మికోన్మనఃస్థితి = ఉంగరంబులు అనగా పవిత్రంబులయందు కోరిక యుండుట. తరంగంబులచే గర్వించి యుండుట, భీమాగ్రజన్మభోగము = శివబ్రాహ్మణత్వము, భీమునికి అన్న యగుట, ధీరత = విద్యత్వము, ధైర్యము.

క.

రాజులయి వచ్చు నృపుల ప
రాజుల విదళింతు రతిరయంబున బలు వా
రాజుల నపరాజుల నయ
రాజుల దరమౌనె యచట రాజులఁ బొగడన్.

49

49. రా... రాజులు = పంక్తులు, పరాజులు = గొప్పయుద్ధము, వారాజులు = వరుణులు, అపరాజులు = రెండవదశరథులు, నయరాజులు = నీతిచే ప్రకాశించువారు.

క.

కెంగేల శైలమెత్తి ర
నంగ నగు దురంతరావణ రమాధిపుల
న్సంగడము కరణి ధరణి భు
జాంగంబున నిలుపుదురు ధరాధిపతపనుల్.

50

50. సంగడంబు = సంక్తోలా. ఇది తరగతి రీతిగ నుండు గరడీ అనుభవవిశేషము. ధరాధిపతపనుల్ = రాజశ్రేష్టులు.