పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

27

ప్పుడు నుండునది, రాత్రులు లేనిది అని భావము అనగా రత్నప్రభలచే నని తెలియవలయు.

క.

పుటభేదనవిప్రులు వా
క్పటిమను భుజగేంద్రుఁ గ్రించు -దు పరుపుచు శ్రుత్యు
త్కటభావముఁ బ్రకటింపఁగ
జట చిక్కుల గెల్చుటెంత సాత్యవతేయున్.

47

47. పుట...క్రిందుపరుచుట = ఓడించుట, అడుగునఁ బడునట్లు చేయుట అని అర్థాంతరము. జటచిక్కు = వేదపఠనావృత్తియందలి సంశయము. జడలయందలి చిక్కు అని అర్ధాంతరము.

సీ.

చదువుచో నలుదెస ల్వెదకని స్రష్టలు
                 పలుకుచో నడుగునఁ బడనిభోగి
వరు లిరుమూల నిల్వని ద్విజరాజులు
                 ధీసురాచార్యతఁ దేని గురులు
క్రమ మెక్కుడై యుగ్రగతి లేనివసుమతు
                 లొగి మేర నజడులౌ నుదధితతులు
సత్యోక్తి మారువేషము లేని ధర్ములు
                 పటుధృతి గండమేర్పడని యచలు


గీ.

లనఁగ జతురాస్యత నహీనతనుగళాని
ధిత్వమున విష్ణుపదసక్తిస్థిరత నూర్మి
కోన్మనస్థితి భీమాగ్రజన్మభావ
ధీరతల నొప్పుదురు ధరాదివిజు లచట.

48

48. ఇఱుమూల = రెండుకోణములతో లేక రెండువైపుల (ప్రాక్పశ్చిమభాగముల) థీన్ = బుద్ధిచే, ఉగ్రగతి = శివుడు అధిష్టించుట (త్రిపురహరణ