పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

రాజవాహనవిజయము


వ.

అంకితంబుగా నాయొనర్పం బూనిన రాజవాహనవిజయంబను ప్రబంధంబునఁ గథానిబంధనం బెట్టి దనిన.

44

44. అంకితంబుగా = స్పష్టార్థము.

కథాప్రారంభము

క.

మగధావని మృగధారిని
నగధాత సృజించినట్టి నరనాథులకున్
నగ రనఁదగుఁ గుసుమాహ్వయ
నగర మగారగతమేరునగరత్నం బై.

45

45. మగ ...మగధావని = మగధదేశమందు. మృగధారిని = చంద్రుని. నగన్ = నవ్వునట్లు, నగ రనన్ = రాజమందిర మనునట్లుగా, అగారగత = గృహమును బొందిన

క.

అన్నగరము రిపుసింధూ
త్పన్నగరము, పన్నతాగ్రపన్నగరము సం
పన్నగరము వెడవెన్నుని
యన్నగరము మనుపు ననని ననిశం బగుటన్.

46

46. అన్నగరము రిపుసింధూత్పన్నగరము = శత్రువులకు హాలాహలము అనఁగా జయింపరాని దనుట. పన్నతాగ్రపన్నగరము = పత్ = పాదమునకు, తన విధేయుఁడగు, అగ్రపన్నగ = శేషునియొక్క, రము = శోభ గలది. సంపన్నగరము = సంపదలకు నాశ్రయము. వెడలె....గరము = వెడవెన్నుని = మాయావిష్ణునియొక్క, అన్ను = భార్యయగు లక్ష్మియొక్క, అగరము = ఆగారమును అనగా పద్మమును, అనిశంబు = ఎల్ల