పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

25

దేవి యొక్క, ఆళి = తుమ్మెదలయు, కళింగావళి = కూకటిమూగ యనెడు నల్లపిట్టల వరుసలయు, భంగ = అపాయమునకు, ఆకర = స్థానమైన అనఁగా వానిని గెల్చునట్టి సైల్యముగలది యని. ఇది అలమేలుమంగ జడకు విశేషణము. వేణి = జడయందు. లోల = ఆసక్తమైన పాణివిహృతికిన్ = హస్తప్రచారము గలవానికి.

క.

ధీమద్భవాబ్ధితరణికి
ధామతలత్తరణిక యవితరణికిఁ భవన
గ్రామగ్రాసగ్రావ
గ్రామగ్రామణికి భరితకౌస్తుభమణికిన్.

42

42. ధీమ... తరణి = తెప్ప, ధామతలత్తరణికి = శుభము లిచ్చువానికి, పవనగ్రామగ్రాసగ్రావగ్రామగ్రామణికి = 6 పదములకు వరుసగా, వాయుసమూహమే గ్రాసముగా గలవాఁడు (శేషుఁడు) తత్సంజ్ఞికమైన పర్వతమందలి గ్రామమునకు అధికారికి.

క.

జటిధూర్జటిభరణవిశం
కటమతికిం దృటితచటులకర టీశ్వరసం
కటగతికిన్ మా తిరువేం
కటపతికిన్ దళితదైత్యకంకటతతికిన్.

43

43. జటి... గతికిన్, జటిధూర్జటీ = యోగీశ్వరులను, భరణ = రక్షించుటయందు, విశంకటమతికి = సమీపమగు బుద్ధిగలవానికి, తృటి...గతికిన్. తృటిత = ఖండించినట్టియు, చటుల = తీవ్రము లైనట్టి. కరటీశ్వరసంకటగతికిన్ = గజేంద్రుని బాధావస్థలుగలవానికిన్. అనఁగా మకరిని జంపి కరిని రక్షించెననుట. దళి...తికిన్. = దళిత = ఛేదింపఁబడ్డ, దైత్యకంకట = రాక్షసుల కవచములయొక్క, తతికిన్ = సమూహము- గలవానికి.