పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

రాజవాహనవిజయము

39. ఏవంనిధ... ధావన్నిధికిన్. ధావన్నిధనాశ = పోవుచున్నమరణాశగలవారుసు. అనఁగా ప్రాణాశగలవారును. ధామధామ = తేజోనిధియగు సూర్యునకు, దవీయః = దూరస్థులును. అనఁగా యుద్ధభీరువులకు సూర్యుఁడు దూరమైయుండుననుట శ్లో॥ ద్వావిమౌపురుషౌలోకే సూర్యమండలభేదినౌ। పరివ్రాడ్యోగయుక్తశ్చ రణేచాభిముఖోహత॥ యనియున్నది. దేవానాంప్రియ=మూర్ఖులును (అయిన) దానవ = రాక్షసులకు. అనాది = క్రొత్తయగు. అప్రమోదపాధోనిధికిన్ = దుఃఖవార్ధియైనవానికిన్.

క.

"శరణాగతరక్షామణి"
బిరుదాంగద వామపాద బిసరుహ నఖరో
త్కర చంద్రాతప లహరి
స్మరణాహత సాధుహృదయసంతాపునకున్.

40

40. శరణా... సంతాపునకున్ = దండాన్వయము. శరణాగతరక్షామణి యనెడు బిరుదుగలిగిన కడియము గల తమ్మివంటి యెడమకాలిగోళ్లవరుస యనెడు వెన్నెలవెల్లువను స్మరించుటచే బాగుగాఁ గొట్టఁబడిన సాధుజనుల సంతాపముగలవానికి.

క.

అంగామితశృంగారత
రంగాంచితవిజితకోటిరతిపతి కలమే
ల్మంగాళికళింగావళి
భంగాకరవేణిలోలపాణివివృతికిన్.

41

41. అంగ...పతికిన్ = అంగ = అవయవములయొక్క, అమిత = మితము లేని, శృంగారతరంగ = కైసేతల పరంపరల యొక్క, అంచిత = ఒప్పిదముచే, విజిత = జయింపఁబడ్డ, కోటిరతిపతికిన్ = అనేకమన్మథులు గలవానికి. అలమే. ..విహృతికిన్. అలమేల్మంగా = అలమేలుమంగా