పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

రాజవాహనవిజయము


పాపవా చెవిఁటికి బట్టిన సంకను
                 నానుడి బధిరు వినంగఁ జేసి


గీ.

యనుచుఁ జను వేంకటాచలాధ్యక్షు జలరు
హాక్షు లక్ష్మీవిశుద్ధశుద్ధాంతవక్షు
బ్రహ్మతిరునాళ్ళ కరుదెంచి ఫలముఁ గాంచి
కటక కళ్యాణ ఢిల్లీ నికటజనంబు.

36

36. ఈ పద్యమంచు నాల్గుపాదములలో లోకోక్తులు చెప్పఁబడ్డవి. ఏవిషయమును బట్టియనగా వేంకటేశ్వరుఁడు గుడ్డివాండ్రకుఁ గనులు, బిడ్డలు లేనిస్త్రీలకు బిడ్డలను, కుంటివానికిఁ బరువెత్తుశక్తి, బధిరునకు వినుశక్తి కల్గఁచేయుననుట. ఇంతియేకాదు ఎవ్వ రేకోరికలు గోరి ముడుపులు గట్టినను వారికార్యసిద్ధులు చేయుచున్నాఁడని తెలియవలయు.

సీ.

ఎటువంటిదో చూడ మెట మంచిగందంబు
                 జిడ్డంచుఁ గౌఁగిటఁ జేర్చి చేర్చి
కనమెన్నఁ డిదిగదా యనుచుఁ గన్నులఁ గది
                 యఁగ బారిజాతంబు నత్తి యత్తి
తలఁపు కెంపిటువంటిదా యంచుఁ దుఱుమునఁ
                 గొనఁ జుట్టునను మేనఁ గూర్చి కూర్చి
వినువాఁక యిదిగదా యనుచు నాకాశగం
                 గావారి నంగముల్ గడిగి కడిగి


గీ.

శేషగిరిఁ జేరి యారామసీమఁ గోరి
శైత్యకృత్యంబు నిత్యంబు సల్పు వేంక
టేశవైశాఖతీర్థనిరీక్ష కరుగు
దెంచు నాసేతుకాశితైర్థికజనంబు.

37