పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

21


కానుక సొమ్ములోఁ గలఁ డన్నిఁట శిఖలో
                 యావుటమెటు మ్రొక్కు లయ్య యబల


గీ.

యనుచు నగి మ్రొక్కుదురు వేంకటాధినాథు
నక్కడికి నల్లుహరిదమ యన్నుమగని
చక్రికుధరోత్తమము నడు చక్కి కెక్కి
చక్క ముక్కోటి కరుదెంచు సౌరసతులు.

35

35. కట్టాణియొంట్లు = మౌక్తికవిశేషములతో గట్టినచౌకట్లు. చేరె....జియ్య = ఆదిభిక్షువు (శివుఁడు) పార్వతి హిమవత్పుత్త్రిగాన నాతండు రత్నపుగనియని యెఱుంగునది. తోమనిపళ్లేలదొర = అగ్నిహోత్రుఁడు. అనగా సృక్సృవాజ్యశరావములు (అగ్నికార్యపరికరములు) అవిదారు మృద్వికారంబులగుటచేఁ దోమఁబడవు. ఆగ్నిహుతుఁడు గాన సువర్ణశాట్యుత్పాదకుడని భావము. వీని లతాంగి = స్వాహాదేవి, ఇందయనును = పుచ్చుకొమ్మనును, వడ్డికాసులుగొనువాఁడు = కుబేరుఁడు. ధనపతిగనుక ఋణప్రదాతయై వడ్డి తీసుకొనునని భావము కుబేరు భార్య చిత్రరేఖ. కానుకసొమ్ము లోఁగలఁడు = కానుకలుగా వచ్చు పదార్ధములు లోపల కలిగియున్నాడు. అవి బహిఃప్రకాశములు గాక యుండెను. అన్నిట మ్రొక్కులయ్య యబల = సూర్యుభార్యయగు ఛాయాదేవిసిగయం దామోదద్రవ్య ముంచుచుండెనని భావము. పుష్పములకు సూర్యు డధిదేవతయని తెలియవలెను, చక్రికుధరోత్తమము = శేషాచలము.

సీ.

ప్రజలఁగాననివాని పాయసంబను సుద్ది
                 తునుమవా దృష్టియంధునకు నిచ్చి
గొడ్రా లెఱుంగునే బిడ్డకుట్టనుట మా
                 న్పింపవా వంధ్యకు నిసువొసంగి
తూలింపవా యెద్దుఁ ద్రోచిన పిచ్చుగుం
                 టను పల్కు పరువు పంగునకు నొసఁగి