పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

రాజవాహనవిజయము


భూతాదిశంకానిరాతంకగహనంబు
                 హరియింపఁ డేవేంకటాద్రినాథుఁ


గీ.

డమృతనిధిఁ జూపఁ డేయంజనాగవిభుఁడు
భద్రమూర్తి యమృతహారి భవ్యకీర్తి
చక్రి శుచినామధేయుండు జడమరీచి
కంకణముగట్టినాఁడు రక్షణము కొఱకు.

34

34. తిరుమలకొండకుఁ బర్యాయములు, వృషభాచలము, గరుడాచలము, శేషాచలము, వేంకటాచలము, అంజనాచలము. ఈయైదిఁటికి నైదుశక్తులు గలవు. అవేవన, వృషభమునకుఁ బంకంబు గోరాడుట, గరుడునకుఁ ద్రుంచుట, శేషునకు వాతాదిరోగంబుల హరించుట, వేంకటునకు భూతప్రేతాదిభయనివారకత్వము, అంజనమునకు నిధులు గనుపఱచుట. పంకంబు = దోషంబులనెడు బురద శ్లిష్టరూపకము, వాతము = గాలియను వాతరోగము, శ్లిష్టరూపకము. అమృతనిధి = మోక్షమనెడు నిక్షేపము, భద్రమూర్తి = మంగళస్వరూపుడు. వృషభరూపుడు = త్రిపురసంహారకాలంబున భూరథంబు దించుకొని పోవుచుండ వృషభమయి మోచెననియుంగలదు. అమృతహారి = గగుడస్వరూపబోధకము. భవ్యకీర్తి = అసాధ్యవాతాదిరోగహరణజన్యమయిన యశస్సు కలవాడని. చక్రి = శుచినామధేయుఁడు. ఇది భూతాదిశంకాగహనచ్ఛేదన దహససూచక విశేషణము. జడమరీచి = ఇది అంజనాభివ్యంజకము.

సీ.

అఱుగునో యనక కట్టానియెంట్లడియెఁగాఁ
                 జేరెఁడు బియ్యాల జియ్యచెలియ
సమయునో యనక కాంచనశాటిఁ గట్టెఁగాఁ
                 నోమని పళ్ళేల దొర లతాంగి
ధనమెంత దఱుగునో యనఁ డింతవెచ్చ మా
                 వడ్డికాసుల వెరవడికిఁ గలికి